సర్కార్ 4 తో సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్.. త్వరలో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు.  

బాలీవుడ్ లో అలరించిన అరుదైన సనిమాల్లో సర్కార్ పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కలసి నటిచిన ఈమూవీ బాలీవుడ్ లో సంచలనం అయ్యింది. అన్నిటింకంటే పెద్ద విశేషం ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేయడం. ఈసినిమాతో వర్మ కూడా సెన్సేషన్ అయ్యారు. అంతే కాదు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కెరీర్‌లో సర్కర్ ఓ స్పెషల్ మూవీగా ముద్ర పడిపోయింది.

రామ్ గోపాల్ వర్మ మార్క్ తో.. హాలీవుడ్‌ క్లాసిక్‌ గాఢ్‌ఫాదర్‌ స్ఫూర్తితో ఈసినిమా తెరెక్కింది. ఈ సినిమాలో అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌ పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుభాష్‌ నాగరే క్యారెక్టర్‌లో అమితాబ్‌ నటన అభినులకు పిచ్చెక్కించింది. ఈ ఏజ్ లో కూడా అమితాబ్ కు నటనపై ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపనిస్తుంది. ఆకట్టుకున్నాయి. అయితే సర్కార్‌ సినిమా ఒక్కదానితో ఆగలేదు. సర్కార్ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాను ఆడియన్స్ ను అలరించాయి. 

2005లో మొదలైన సర్కార్ మూవీ ప్రవాహం.. ఫస్ట్ మూవీ సర్కార్ గా.. సెకండ్ మూవీ 2008లో సర్కార్‌ రాజ్ గా.. 2017లో సర్కార్‌ 3 గా రూపొందాయి. ఈ మూడు సినిమాలను రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే తెరకెక్కాయి. ఇక ఈ ప్రాంఛైజీలో నాలుగో సినిమాను కూడా తీసుకొస్తామని నిర్మాత ఆనంద్‌ పండిట్‌ తాజాగా ప్రకటించారు. అతి త్వరలోనే ఈసినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు ఆయన తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ…సర్కార్‌ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలో సర్కార్‌ 4 ఉంటుంది. అన్నారు. ఇక ఈమూవీకి డైరెక్టర్ ఎవరు అనేది చెప్పకపోయినా.. ఖచ్చితంగా ఆర్జీవినే అయి ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇక ఈ మేకర్స్.. త్వరలో అభిషేక్‌ బచ్చన్‌తో బిగ్‌ బుల్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా నిర్మించబోతున్నారు. ఈసారి ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. 

ఇక రామ్ గోపాల్ వర్మ గత కొద్ది కాలంగా టాలీవుడ్ మీదే కాన్సంట్రేట్ చేశాడు. ఇక్కడ వరుసగా చిన్న బడ్జెట్ తోసినిమాలు చేస్తూ.. హైదరాబాద్ లోనే గడిపేస్తున్నారు. ఇక సర్కార్ 4 కోసం ఆర్జీవి మళ్ళీ ముంబయ్ ప్లైట్ ఎక్కబోతున్నారు. మరి అక్కడ మరోసారి వరుసగాసినిమాలు ప్లాన్ చేసుకుంటాడా...? మళ్ళీ హైదరాబాద్ కు తన మకాం మారుస్తాడా అనేదిచూడాలి.