Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ నిజంగా ఈ ప్రాజెక్టు చేస్తే ...మొత్తం లెక్కలు మారిపోతాయి

ఒక వేళ ఈ వార్త క‌నుక నిజం అయితే రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల ఆనందానికి హ‌ద్దుంలుండ‌వు. ఎందుకంటే సాహో సినిమాతో ప్ర‌భాస్‌, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్‌లో 100కోట్ల మార్కెట్‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. 

Ram Charan Would love to work with #RajkumarHirani jsp
Author
First Published Oct 5, 2023, 12:14 PM IST

ఇంతకు ముందు రామ్ చరణ్ వేరు ఇప్పుడు RRR సినిమా తర్వాత రామ్ చరణ్ వేరు. ఆ సినిమా తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. తనకు వచ్చిన ఇమేజ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేందుకు మార్గం వేసుకుంటన్నాడు. అందులో భాగంగా చరణ్ ఓ బాలీవుడ్ డైరక్టర్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..
 
ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్,ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా,మరియు సుకుమార్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ వరస లైనప్ లో  బాలీవుడ్  దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా కలవనున్నట్లు సమాచారం.  మున్నా భాయ్ MBBS , లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్ , పీకే ,సంజు వంటి సంచలనాత్మక సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ తో సినిమా చేయాలని అందరి హీరోలకు ఉంటుంది. అయితే ఆయన తన దగ్గరున్న కథకు తగిన హీరోతో ముందుకు వెళ్తూంటారు.   ప్రస్తుతం ఆయన షారుఖ్ ఖాన్ తో ‘దుంకీ’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ చితం తర్వాత ఆయన చెయ్యబొయ్యే సినిమా రామ్ చరణ్ తో అని వార్తలు గుప్పమంటున్నాయి. 

గతంలో  రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ దర్శకుడుతో ప్యాన్ ఇండియా లెవిల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. ఈ మేరకు ముంబైలో డిస్కషన్స్ జరిగాయని, త్వరలోనే ఎనౌన్సమెంట్ వస్తుందంటున్నారు. ఈ సినిమాని  ప్రముఖఇండియన్ క్రికెటర్, మన దేశానికీ మూడు వరల్డ్ కప్స్ నితెచ్చి పెట్టిన మహేంద్ర సింగ్ ధోని తో చేయబోతున్నారంటున్నారు.

 ధోనిభార్య రీసెంట్ గానే ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసి, సినిమాలు తియ్యడం ప్రారంభించిన సంగతిఅందరికీ తెలిసిందే. ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు ‘LGM’ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా వర్కవుట్ కాలేదు, దీంతో ధోని... రామ్ చరణ్ ని పెట్టి ఒక్క భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ని నిర్మించడానికిధోని సన్నాహాలు చేస్తున్నాడని, అది రాజ్ కుమార్ హిరానీతోనే అంటున్నారు. ఇవన్నీ గాలి వార్తలా,నిజమా అనేది అఫీషియల్ ఎనౌన్సమెంట్ వస్తేకానీ తెలియదు. ఒక వేళ ఈ వార్త క‌నుక నిజం అయితే రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల ఆనందానికి హ‌ద్దుంలుండ‌వు. ఎందుకంటే సాహో సినిమాతో ప్ర‌భాస్‌, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్‌లో 100కోట్ల మార్కెట్‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios