Asianet News TeluguAsianet News Telugu

పుట్టబోయే బిడ్డగురించి మొదటిసారి స్పందించిన ఉపాసన కొణిదెల

పుట్టబోయే బిడ్డ గురించి మొదటి సారి స్పందించింది.. మెగా కోడలు ఉపాసన. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకల్లో సందడి చేసిన చరణ్ భార్య. ఈ సందర్భంగా ట్విట్టర్ లో తన ఆనందాన్నిపంచుకుంది. 
 

Ram Charan Wife Upasana first time React about her baby
Author
First Published Jan 12, 2023, 8:28 AM IST


పుట్టబోయే బిడ్డ గురించి మొదటి సారి స్పందించింది.. మెగా కోడలు ఉపాసన. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకల్లో సందడి చేసిన చరణ్ భార్య. ఈ సందర్భంగా ట్విట్టర్ లో తన ఆనందాన్నిపంచుకుంది. 

పెళ్ళైన చాలా కాలానికి తల్లి తండ్రుల కాబోతున్నారు రామ చరణ్ ‌- ఉపాసన. ఈ విషయం గురించి మొదటి సారి స్పందించింది ఉపాసన కొణిదెల. కాలిఫోర్నియాలో జరుగుతున్న  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకోసం భర్త రామ్ చరణ్ తో కలిసి పాల్గొన్న  ఉపాసన.. ఆర్ఆర్ఆర్ మూవీ  అవార్డ్ గెలుచుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యాక్తం చేసింది. ఈ విషయంతో పాటు తన ప్రెగ్నెస్సీ విషయాన్ని కూడా ప్రస్థావిస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. 

 

టీమ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఉపాసన.. ఆర్ఆర్ఆర్ టీమ్ లో భాగమయినందకు నాకెంతో  హ్యాపీగా ఉంది.. దేశం గర్వించదగ్గ విజయం ఇది. ఈ ప్రయాణంలో నేనూ భాగమయ్యేలా చేసినందకు  రామ్ చరణ్ కు .. దర్శకుడు రాజమౌళికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది ఉపాసన. అంతే కాదు ఈ వేడుకల్లో తన తో పాటు.. తన కడుపులో ఉన్న బేబీ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ.. ట్వీట్ చేసింది ఉపాసన. ఇక ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకులో రెండు నామినేషన్లు సాధించింది త్రిపుల్ ఆర్ మూవీ. ఈక్రమంలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కు గొల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖలు నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక ఆస్కార్ రేస్ లో కూడా దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios