మూడు నెలల తర్వాత చరణ్ ఇంటికి క్లిన్ కార... వేద మంత్రాలతో ఆహ్వానం!
మూడు నెలలు అమ్మమ్మ ఇంట్లో ఉన్న క్లిన్ కార తాతయ్య చిరంజీవి ఇంట్లో అడుగు పెట్టింది. క్లిన్ కారకు వేద మంత్రాలతో కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికారు.

పదేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన కొణిదెల గర్భం దాల్చిన విషయం చిరంజీవి 2022 డిసెంబర్ నెలలో అభిమానులతో పంచుకున్నారు. 2023 జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. బారసాల కార్యక్రమం ఘనంగా జరిపిన రామ్ చరణ్-చిరంజీవి క్లిన్ కార అని నామకరణం చేశారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు ఎంచుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రసవించాక తల్లి పేరెంట్స్ వద్ద ఉండాలి. కనీసం మూడు నెలలు పుట్టింట్లో గడిపాక అత్తింటికి రావాలి. ఆ సాంప్రదాయం పాటిస్తూ ఉపాసన అక్కడే ఉన్నారు. తాతయ్య, అమ్మమ్మ అనిల్, శోభన కామినేని ఇంటి నుండి నేడు చిరంజీవి ఇంటికి క్లిన్ కార చేరింది. వారసురాలి తొలి అడుగు పెట్టే కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదాలు అభ్యసిస్తున్న విద్యార్థులను ఆహ్వానించారు.
క్లిన్ కార ఇంట్లో అడుగుపెడుతుండగా వేద మంత్రాలు వాళ్ళు ఉచ్చరించారు. క్లిన్ కారను వేద మంత్రాల నడుమ గొప్పగా అహ్వానించారు. వినాయక చవితి వేళ చిరంజీవి కుటుంబంలో చోటు చేసుకున్న ఈ వేడుక ప్రత్యేకత సంతరించుకుంది.
మరోవైపు చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు శంకర్ సోషల్, పొలిటికల్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. సునీల్, అంజలి, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఒక పాట లీక్ కాగా ట్రోల్స్ కి గురైంది...