విరాట్ కోహ్లీ నాకు ఆదర్శం.. బయోపిక్ లో నటిస్తా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కామెంట్స్
తన మనసులో మాట బయట పెట్టాడు రామ్ చరణ్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయెపిక్ లో నటించాలని ఉంది అంటూ వెల్లడించారు. కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటానంటున్నాడు చరణ్.

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినిమాతారలు, పొలిటీషియన్లు, స్టార్ క్రికెటర్ల జీవిత చరిత్రలను సినిమాలుగా చేస్తున్నారు. ఇప్పటికే చాలా బయోపిక్ లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ప్రస్తుతం కూడా కొన్ని బయోపిక్ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ బయోపిక్ మూవీస్ తో నటించడానికి సూపర్ స్టార్లు కూడా పోటీపడుతున్నారు. ఈక్రమంలోనే తనకు కూడా బయోపిక్ మూవీలో నటించాలి అని ఉంది అని మనసులో మాట బయట పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అవును రామ్ చరణ్ కు బయెపిక్ మూవీలో నటించాలని ఉందట. రీసెంట్ గా ఆస్కార్ లో మెరిసిన మెగా హీరో.. నిన్ననే ఇండియాకు వచ్చాడు. అయితే వచ్చి రావడంతోనే ఢిల్లీలో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ హీరో.. ఇండియా టుడే కు సబంధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల, స్టార్ సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని రామ్ చరణ్ దక్కించుకున్నారు. ఈసందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. తను విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు. కుదిరితే కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల బయోపిక్ లు తెరకెక్కాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు అందులో లీడ్ రోల్స్ చేశారు. కపిల్ దేవ్ బయోపిక్ ను రన్ వీర్ సింగ్ చేయగా.. థోనీ బయోపిక్ లో సుశాంత్ సింగ్ అద్భుతంగా నటించాడు. ఈక్రమంలోనే త్వరలో గంగూలీ బయెపిక్ కూడా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ చేయబోతున్నారు. ఈక్రమంలోనే విరాట్ కొహ్లీ బయోపిక్ ను నటించాలని ఉంది అని చరణ్ మనసులో మాట బయట పెట్టారు. మరి బాలీవుడ్ నుంచి కాని.. సౌత్ నుంచి కాని.. ఈ విషయంలో దర్శకులెవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఫ్యూచర్ లో చరణ్ ను కొహ్లీ పాత్రలో చూసే అవకాశం ఉన్నట్టు స్పంస్టం అవుతోంది.
ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గామారిపోయాడు చరణ్. హాలీవుడ్ స్టార్ నుంచి ప్రశంసలు పొందాడు. ఆర్ఆర్ఆర్ లో తన నటనను మెచ్చి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామరాన్, స్పిల్ బర్గ్ లాంటి వారు చరణ్ పెర్ఫామెనస్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో చరణ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మన ఇండియన్ ప్రేక్షకులతో పాటు..హాలీవుడ్ ఆడియన్స్ కూడా చరణ్ ను కలవడానికి పోటీ పడ్డారు. త్వరలో చరణ్ హాలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నట్టు టాక్.