రామ్‌ చరణ్‌, ఉపాసన తిరుమలలో సందడి చేశారు. కూతురు క్లీంకారతో కలిసి ఈ ఉదయాన్నే తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు.  

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తిరుమలలో సందడి చేశారు. నేడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మార్నింగ్‌ సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. తన బర్త్ డే సందర్భంగా ఆయన సతీసమేతంగా వెంకటేశ్వరస్వామి ఆశిస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 

తన పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రమే తిరుమలకి చేరుకున్నారు రామ్‌ చరణ్‌ దంపతులు. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి స్థానిక అభిమానులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఎయిర్‌ పోర్ట్ నుంచే ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు తిరుమలలోనూ వారంతా సందడి చేయడం విశేషం. దీంతో కోలాహలం నెలకొంది. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్‌చరణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. 

ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాబినయం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్‌గా కనిపిస్తాడట. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి మొదటిపాటని విడుదల చేయబోతున్నారు. 

`జరగండి జరగండి`అంటూ సాగే మొదటి పాటని ఈ ఉదయాన్నే విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేయగా, అది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది. మరోవైపు తన బర్త్ డే సందర్భంగా రామ్‌ చరణ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ `మగధీర`ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. 

Scroll to load tweet…