రామ్‌చరణ్‌ మరో అరుదైన ఘనతసాధించారు.ఇప్పటికే అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఆయన తాజాగా ఫోర్బ్స్ పైకి ఎక్కారు. 

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌.. మరో అరుదైన ఘనత సాధించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి ఆయన ఇమేజ్‌ పెరుగుతూ వస్తోంది. అభిమానులు ఏకంగా గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఇచ్చేశారు. పలు హాలీవుడ్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు రామ్‌చరణ్‌. `ఆస్కార్‌` సమయంలో.. అంతర్జాతీయ మీడియాలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆ ఇమేజ్‌ని తనదైన స్టయిల్‌లో క్యాష్‌ చేసుకున్నాడు చరణ్‌. 

ఈ క్రమంలో రామ్‌చరణ్‌ మరో అరుదైన ఘన సాధించారు. ఆయన ఫోర్బ్స్ మేగజీన్‌ పైకి ఎక్కారు. తాజాగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ ఎడిషన్‌ మేగజీన్‌పై ఆయన దర్శన మిచ్చాడు. తన భార్య ఉపాసనతో కలిసి చరణ్‌ ఫోర్బ్స్ మేగజీన్‌ కవర్‌ పేజ్‌పైకి రావడం విశేషం. లేటెస్ట్ ఎడిషన్‌లో వీరి ప్రత్యేక సంచిక ప్రచురితం అయ్యింది. ఇందులో చరణ్‌, ఉపాసన ఒకరి గురించి మరొకరు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి పరిచయం, లవ్‌, పెళ్లి, వ్యాపారాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలా అన్నింటి గురించి ఇందులో చర్చించినట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. హాట్‌ టాపిక్ అవుతుంది. మెగా అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వారంతా ఖుషి అవుతున్నారు. మరోసారి చరణ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ప్రస్తుతం చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది మిడ్‌లో రిలీజ్‌ కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.