మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan దంపతులు ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. బోకే అందించి ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చరణ్ కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. కొద్దిరోజులుగా అక్కడే కనిపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ముంబైలోని మహారాష్ట్ర సీఎం (Maharastra CM) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ను సీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చాలా సమయం సీఎంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తమ వ్యక్తిగత విషయాల కోసమే సీఎంను కలిశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చరణ్ మహారాష్ట్ర సీఎంతో కలిసి దిగిన ఫొటోలను తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. తమకు ఆతిథ్యం ఇచ్చిన మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముంబై ప్రజలు తమపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫొటోల్లో రామ్ చరణ్, ఉపాసన మాత్రమే కనిపించారు. మెగా ప్రిన్సెస్ క్లింకార (Klin Kaara)ను వెంట తీసుకురాలేదని తెలుస్తోంది. సీఎంను కలిసి సందర్బంగా శ్రీకాంత్ షిండే భార్య వృశాలి వారికి సాంప్రదాయ తిలకం దిద్దింది. అలాగే దంపతులకు హారతితో స్వాగతం పలికారు. ఇక రామ్ డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. మెగా కోడలు ఉపాసన పూల కుర్తాలో సింపుల్ గా మెరిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

రామ్ చరణ్ మూవీ అప్డేట్స్ విషయానికొస్తే... దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRRతో అలరించారు. ఈ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ Game Changer రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రావాల్సిన ఈ చిత్రం ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
