ఫస్ట్ డే నుంచే సత్తా చూపిస్తోంది సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ. ఇటు ప్రేక్షకుల స్పందనతో పాటు..సెలబ్రిటీలు కూడా ఈమూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో మెగా ఇంట సబంరాలు స్టార్ట్ అయ్యాయి.
మెగా మేనల్లుడు.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తరువాత విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈలోపు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఈ మెగా హీరో.. విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టాడు. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న (ఏప్రిల్ 21) రిలీజ్ అయ్యి... ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది. అంతే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ అవుతోంది. ఇక సాయి ధరమ్ కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ కూడా ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక ఇప్పటికే మొదటి రోజు ఆట చూసి.. దిల్ ఖుష్ అయిన సాయి తేజ్.. డైరెక్టర్ తో కలిసి తన సంతోషం పంచుకున్నాు. అంతే కాదు మెగా ఫ్యామిలీలో కూడా ఈమూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న చిరంజీవి తన ఇంటిలో సాయి ధరమ్ ని అభినందిస్తూ మూవీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి ధరమ్ తేజ్ ను అభినందిస్తూ.. విరూపాక్ష టీమ్ కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి.. చిరంజీవి భార్య సురేఖ తేజ్ కు కేక్ తినిపిస్తున్నఫోటోను చిరు శేర్ చేశారు.
తాజాగా ఈ మూవీ సక్సెస్ గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. “కాంగ్రాట్యులేషన్స్ బ్రదర్. విరూపాక్ష గురించి మంచి టాక్ వినిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సాయి ధరమ్ రిప్లై ఇస్తాడు.. ‘థాంక్యూ సో మచ్ మై లవింగ్ బ్రదర్ చరణ్’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.
మరో వైపు ఈసినిమాపై నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. విరూపాక్ష సినిమా గురించి ట్వీట్ చేశారు. డియర్ బ్రదర్ అంటూ.. సాయితేజ్ విరూపాక్ష సినిమాతో సక్సెస్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సాయి కెరీర్ లోనే ఈమూవీ చాలా స్పెషల్ అన్నారు కల్యాణ్ రామ్. కార్తీక్ దండు డైరెక్షన్ కాని..స్క్రిప్ట్ కాని.. ఎక్స్ లెంట్ అంటూ.. ఈసినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్అందరిని అభినందించారు కల్యాణ్ రామ్.
ఇక ఈమూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అంతా ఈగర్ గా వెయిట్ చేశారు.ఎంత కలెక్ట్ చేసి ఉంటాయా అని అనుకున్నారంతా.. కాగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా జోరు చూపిస్తుంది. మొదటి రోజే ఏకంగా 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సాయి ధరమ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అలాగే US బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 200K డాలర్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించినా.. ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. సినిమాకు వచ్చే స్పందనను బట్టి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. ఇప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో త్వరలో ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవ్వడం పక్క అని తెలుస్తుంది.
