మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏసీ చిత్రం తర్వాత చిరు క్రేజీ డైరెక్టర్ కొరటాల దర్శత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం కొరటాల శివ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. సందేశాత్మక కథతో సాగే ఈ చిత్రంలో రాంచరణ్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ నెం 150లో రాంచరణ్ ఓ సాంగ్ లో మెరుస్తాడు. అలా ఈ చిత్రంలో సరదా కోసం చరణ్ నటించడం లేదట. 

రాంచరణ్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల, చిరు చిత్రం గురించి అన్ని విషయాలు వివరంగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.