మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. రాజమౌళి టేకింగ్ కి దేశం మొత్తం ఫిదా అవుతోంది. త్వరలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. రాజమౌళి టేకింగ్ కి దేశం మొత్తం ఫిదా అవుతోంది. త్వరలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కెజిఎఫ్ మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 

దీనితో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. నేడు కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. క్రేజీ న్యూస్ ఏంటంటే కెజిఎఫ్ 2 తెలుగు ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంచ్ చేయనున్నారు. 

ఈమేరకు కెజిఎఫ్ 2 చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనితో రాఖీ భాయ్ కి రామరాజు హెల్ప్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కెజిఎఫ్ మొదటి భాగంలో ప్రశాంత్ నీల్ యష్ ని పవర్ ఫుల్ మాస్ ఎలివేషన్స్ తో ప్రజెంట్ చేశాడు. 

కెజిఎఫ్ 2 అంతకు మించేలా ఉండబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ రోజు సాయంత్రం 6.40 గంటలకు కెజిఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ కానుంది. దీనితో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. కెజిఎఫ్ 2 చిత్రం కరోనా కారణంగా వరుసగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఈ చిత్ర ట్రైలర్ ని స్టార్ హీరో సూర్య లాంచ్ చేయనున్నారు.