#RC16: రామ్ చరణ్, బుచ్చి బాబు చిత్రం కిక్కిచ్చే అప్డేట్

ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద సోలోగా కొన్ని సీన్స్ తీస్తారు. ఈ సినిమా కోసం చరణ్ బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారు. 

Ram Charan to enter sets of RC 16 in May JSP


 రామ్ చరణ్ త్వరలో  ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో RC16 సినిమా చేయటానికి రంగం సిద్దమైంది. రంగస్థలం లాగా ఈ సినిమా కూడా ఒక మట్టి మనిషి కథ అని, పల్లెటూరి లో జరిగే స్టోరీ అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇంకా లాంచ్ కాని ఈ సినిమా షూటింగ్ ఎప్పటునుంచి అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేఫధ్యంలో  ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేమిటంటే..

ఈ చిత్రం మే నెలాఖరు నుంచి ప్రారంభంకానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద సోలోగా కొన్ని సీన్స్ తీస్తారు. ఈ సినిమా కోసం చరణ్ బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారు. శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా మార్చి చివరకు పూర్తవుతుంది. ఏప్రియల్ లో రెస్ట్ తీసుకుని మే నుంచి బుచ్చి బాబు సినిమా సెట్స్ కు చరణ్ రానున్నారు. 
 
RC16 చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్ రహమాన్ వర్క్ చేస్తున్నరు. ఇప్పటికే బుచ్చిబాబు స్క్రిప్టు వర్క్, రహమాన్ రెండు పాటలు ఇచ్చారుంటున్నారు. ఈ మధ్యే బుచ్చి బాబు, నిర్మాత నవీన్ యెర్నేని రహమాన్ ని కలిసినట్టు సంగీతం విషయంలో చర్చలు జరిపినట్టు, ఆ విషయం రామ్ చరణ్ కి కూడా చెప్పి ఓకే చేయించినట్లు చెప్తున్నారు.  

బుచ్చిబాబు మాట్లాడుతూ...‘నేను రామ్‌ చరణ్‌తో తీయనున్న మూవీ  (#RC16)  రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. నేను కథ రాసుకుంటున్న సమయంలో ఆయన సంగీతం అందిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయన్ని సంప్రదించి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. ఆయనకు చాలా నచ్చిందీ కథ. ‘ఇప్పటి వరకూ చాలా స్టోరీలు విన్నా కానీ, ఇలాంటిది వినలేదు. కచ్చితంగా మ్యూజిక్ చేస్తాను’ అన్నారు. అందరూ ఇది స్పోర్ట్స్‌ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌ కోసం నాలుగు సంవత్సరాలుగా వర్క్‌ చేస్తున్నాను’’ అని బుచ్చిబాబు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios