రామ్ చరణ్ వంటి స్టార్ హీరో మరొక హీరోకి డబ్బింగ్ చెప్పటం ఎప్పుడూ క్రేజ్ క్రియేట్ చేసేదే. సల్మాన్ సినిమాలకు ఒకప్పుడు అంటే ప్రేమ పావురాలు, ప్రేమాలయం రోజుల్లో మార్కెట్ ఉంది. కానీ మెల్లిమెల్లిగా అది మాయమైపోయింది. దాంతో తన సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలంటే రామ్ చరణ్ వంటి స్టార్ కలిస్తే బజ్ క్రియేట్ అవుతుందని భావించటంలో వింతేమే లేదు. 

దానికి తోడు  సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ల మధ్య క్లోజ్ బాండింగ్ ఉంది. రామ్ చరణ్ ముంబై వెళ్తే అక్కడ సల్మాన్ ని కలవకుండా రాడు. ఇక  అంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన  ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీ కు  కూడా సల్మాన్ కు రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో మరోసారి సల్లు భాయ్ కు వాయిస్ ఇవ్వటానికి చెర్రీ ఫిక్స్ అయ్యిపోయారు. ఇంతకీ ఏ సినిమాకు అంటే...సల్మాన్ తాజా చిత్రం భారత్ కు. 

టి-సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన చిత్రం భారత్.  ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు.ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’. 

ఇందులో సల్మాన్‌కు జంటగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. సల్మాన్‌ సోదరి పాత్రలో మరో హీరోయిన్ దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు నిర్మాతలు చెప్తున్నారు.  భారత్ మూవీ తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఇస్తున్నారు. 

ఈ సినిమాను భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో సల్మాన్ ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించున్నాడు.  యువకుడిగా, గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, వృద్ధుడిగా వివిధ పాత్రల్లో సల్మాన్ తన నటనతో ఫ్యాన్స్ కు పండుగ చేయనున్నాడు.

అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందిన సుల్తాన్, టైగర్ జిందా హై మూవీస్ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ హిట్ కాంబినేషన్ లో రూపొందిన భారత్ మూవీ పై ప్రేక్షకులకు, సల్మాన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.