మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర షూటింగ్ ఎట్టకేలకు పూర్తి కావచ్చింది. చిరు డబ్బింగ్ కూడా చెప్పేశాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణే నిర్మాత. 

బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి ప్రముఖ నటులంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. రాంచరణ్ ఈ చిత్రం కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో ఏ విషయంలోనూ రాజీ పడలేదు. 

నయనతారకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ చిత్రానికి ఒప్పించారు. ఇక నయన్ షూటింగ్ సమయంలో బసచేసేందుకు హోటల్, రవాణా ఖర్చులు మొత్తం రాంచరణే భరించాడట. దీనితో సైరా చిత్రం కోసం నయనతార ఖర్చే తడిసి మోపెడైనట్లు తెలుస్తోంది. మొత్తంగా నయన్ ఖర్చు వల్ల నిర్మాతగా చరణ్ కు చుక్కలు కనిపించినట్లు ఇండస్ట్రీలో టాక్!