బాబాయ్.. నీకొక స‌ర్‌ప్రైజ్: పవన్ కోసం చరణ్ పోస్ట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 3:56 PM IST
ram charan special surprise for pawan kalyan
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. ఆయనకి సంబంధించిన ఏ వేడుకనైనా సరే అంగరంగ వైభంగా నిర్వహిస్తుంటారు ఫాన్స్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో పవన్ కు వీరాభిమానులు ఉన్నారు. ఆయనకి సంబంధించిన ఏ వేడుకనైనా సరే అంగరంగ వైభంగా నిర్వహిస్తుంటారు ఫాన్స్. రేపు(సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భ,గా ఆయన అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఆయన బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఓ స‌ర్‌ప్రైజ్ అంటూ వీడియో పోస్ట్ చేశారు. ''హాయ్ ఫ్రెండ్స్.. మీ అందరికీ ఓ స‌ర్‌ప్రైజ్ ఉంది. బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా.. 24 గంటల్లో ఆ స‌ర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. బాబాయ్ నీకోసం నా దగ్గర స‌ర్‌ప్రైజ్ ఉంది'' అంటూ వెల్లడించాడు చరణ్.

బోయపాటి దర్శకత్వంలో చరణ్  నటిస్తోన్న సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని పవన్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వబోయే స‌ర్‌ప్రైజ్ కూడా అదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

loader