అక్టోబర్ 2కోసం మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి మూవీ వివిధ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సైరా సినిమా తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. 

అయితే సినిమాలో అందరూ ఎక్కువగా వాయిస్ ఓవర్ పై అంచనాలు పెంచేసుకుంటున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడి కథ కావడంతో కథకు తగ్గట్టుగా వచ్చే వాయిస్ ఓవర్ స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమాకు బలం చేకూరుతుంది. అందుకే ప్రతి భాషలో స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ స్టామినా ఏమిటో టీజర్ తో అర్థమైపోయింది. 

ఇక మలయాళంలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన వాయిస్ ని అందించి కేరళలో సాలిడ్ హైప్ క్రియేట్ చేశారు. కోలీవుడ్ లో కమల్ హాసన్ తన బేస్ వాయిస్ తో బలాన్ని చేకూర్చినట్లు సమాచారం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక వాయిస్ ఓవర్ అందించిన సూపర్ స్టార్స్ కి రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి వారి గాత్రం సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.