ఉపాసన కోసం చరణ్ ఏం కొన్నాడో చూడండి!

ram charan special gift to upasana
Highlights

రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా 

రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు కాబట్టి అతడికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఉపాసన అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా ఉపాసన.. చరణ్ తనకోసం ప్రత్యేకంగా కొని తీసుకొచ్చిన గిఫ్ట్ ను అభిమానులకు చూపిస్తూ తెగ మురిసిపోతుంది.

సోమవారం సాయంత్రం చరణ్ పూల మార్కెట్ కు వెళ్లి రంగురంగుల పూలతో బొకే చేయించి దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది ఉపాసన. 
'సో స్వీట్.. మిస్టర్ సి నాకోసం పువ్వులు కొనడానికి షాపింగ్ కు వెళ్ళారు.. మనసున్న మనిషి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం చరణ్.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జంటగా కైరా అద్వానీ కనిపించనుంది. 

 

loader