ప్రమోషన్‌లో భాగంగా కొన్ని షార్ట్ క్వచ్ఛన్స్ ని అడిగారు యాంకర్స్. అలా రామ్‌చరణ్‌కి సమంత ప్రశ్న ఎదురైంది. సమంత గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతారని యాంకర్‌ ప్రశ్నించగా, చరణ్‌ అదిరిపోయే సమాధానమిచ్చాడు.

రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్‌లో భాగంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ఆయన సమంత గురించి స్పందించడం విశేషం. షాట్‌ అండ్‌ స్వీట్‌గా ఆమె గురించి చరణ్‌ చెప్పిన వీడియో వైరల్‌ అవుతుంది. బాలీవుడ్‌ ప్రమోషన్‌లో భాగంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ బిజీగా గడుపుతుంది. రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి టీమ్‌ ఇంటర్వ్యూలు, వ్యక్తిగతంగానూ ఇంటర్వ్యూలిచ్చారు. నేషనల్‌ మీడియా టార్గెట్‌గా `ఆర్‌ఆర్‌ఆర్‌`ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు. 

ఈ ప్రమోషన్‌లో భాగంగా కొన్ని షార్ట్ క్వచ్ఛన్స్ ని అడిగారు యాంకర్స్. అలా రామ్‌చరణ్‌కి సమంత ప్రశ్న ఎదురైంది. సమంత గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతారని యాంకర్‌ ప్రశ్నించగా, చరణ్‌ అదిరిపోయే సమాధానమిచ్చాడు. షాట్‌ అండ్‌ స్వీట్‌గా చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఇంతకి రామ్‌చరణ్‌ ఏం చెప్పారంటే సమంత `కమ్‌ బ్యాక్‌, బిగ్గర్‌, స్ట్రాంగర్‌` అని తెలిపారు. చాలా పెద్దగా, బలంగా ఆమె తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. రామ్‌చరణ్‌ సమాధానంతో ఎన్టీఆర్‌, రాజమౌళి సైతం అభినందనలతో కూడిన నవ్వులు చిందించారు. 

Scroll to load tweet…

అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది కాస్త సమంత వరకు వెళ్లింది. దీంతో ఆమె ఆ వీడియోని రీట్వీట్‌ చేసింది. చరణ్‌కి ప్రేమతో లవ్‌ ఎమోజీలను పంచుకుంది. ప్రస్తుతం సమంత ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది. అటు రామ్‌చరణ్‌ అభిమానులను, ఇటు సమంత అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఓ హీరోయిన్‌పై చరణ్‌ ఇలాంటి పాజిటివ్‌తో కూడిన ప్రోత్సాహక కామెంట్‌ అందరి హృదయాలను గెలుచుకుంది. చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో ఉన్నారు. అక్కడ ఈ సాయంత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. 

ఇక చరణ్‌ చెప్పినట్టుగానే సమంత బలంగా కమ్‌ బ్యాక్‌ అయ్యింది. రెట్టింపు ఉత్సాహంతో ఆమె ముందుకు సాగుతుంది. ఆమె వరుసగా సినిమాలను ప్రకటిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. `యశోద` అనే ఓ సినిమాలో నటిస్తున్న సమంత, దీంతోపాటు మరో బైలింగ్వల్‌ సినిమా చేస్తుంది. అలాగే హిందీలో వరుణ్‌ దావన్‌తో ఓ సినిమా చేయబోతుందని టాక్‌. మరోవైపు ఓ ఇంటర్నేషనల్‌ సినిమాని కూడా ప్రకటించింది సమంత. హృతిక్‌తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు టాక్‌. అలాగే తెలుగులో ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలోనూ సమంత పేరు వినిపిస్తుంది. అన్నట్టు చరణ్‌ `రంగస్థలం`లో సమంత హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే సమంత.. తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్టు అక్టోబర్‌ 2న ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పెళ్లి రోజుకి సరిగ్గా నాలుగు రోజుల ముందు చైతూ, సమంత ఈ ప్రకటన చేసి వారి అభిమానులకు షాకిచ్చారు. తామిద్దరం ఇకపై కలిసి ఉండలేమని, స్నేహంగానే విడిపోతున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత సమంత తాను ఎంతో స్ట్రగుల్‌ అయినట్టు, మానసికంగా ఎంతో కృంగిపోయినట్టు వెల్లడించింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి క్రమంగా కోలుకుంటూ, పుంజుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో ఆమె కెరీర్‌పై దృష్టిపెట్టింది. అంతే దూకుడుతో రాణిస్తుంది సమంత. మరింత స్వేచ్చగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

also read: RRR in Shock: `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో షాక్‌.. చివరికి తెలంగాణ సర్కార్‌ కూడా.. డైలమాలో రాజమౌళి టీమ్‌