పాటకు పది, ఫైటుకి పది కోట్లు..రామ్ చరణ్ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్న శంకర్...?

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిపోయింది... ఇక రామ్ చరణ్ కంప్లీట్ గా తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెంచుతున్నాడు. ముఖ్యంగా శంకర్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు చరణ్. ఈ సినిమా కోసం కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్. 
 

Ram Charan, Shankar Movie Update

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిపోయింది... ఇక రామ్ చరణ్ కంప్లీట్ గా తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెంచుతున్నాడు. ముఖ్యంగా శంకర్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు చరణ్. ఈ సినిమా కోసం కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్. 

మెగా హీరో  రాంచ‌ర‌ణ్ , సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్   కాంబినేషన్ సినిమా స్పీడ్ అప్ అవ్వబోతోంది. ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ అంతా శంకర్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న‌ సినిమా పైనే పెట్టాడు రామ్ చరణ్. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి చరణ్ ఫ్రీ అవ్వడంతో ఇక ఇంకా స్పీడ్ పెంచబోతున్నారు. 

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఓ ఆస‌క్తిక‌ర అప్ డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు అన్న సంగతి తెలిసిందే, అయితే మరీ ముఖ్యంగా ఈమూవీలో శంక‌ర్‌ ఓ పాట‌, ఫైట్  కోసం ఏకంగా 20 కోట్లు ఖ‌ర్చుపెట్టాడ‌న్న వార్త ఇపుడు  హాట్ టాపిక్ అయ్యింది.  ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ఓ పాట‌ను రామోజీఫిలింసిటీలో షూట్ చేయ‌గా..దీనిపై రూ.9కోట్లు ఖ‌ర్చుపెట్టాడ‌ట శంక‌ర్.

అంతేకాదు పక్క రాష్ట్రంలో ఓ ఫైట్ స‌న్నివేశం కోసం శంక‌ర్ .10 కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి వీఎఫ్ఎక్స్, సీజీ, గ్రీన్ మ్యాట్స్ అందుబాటులో లేన‌పుడు ఫైట్స్, పాట‌ల‌ను అద్బుతంగా డిజైన్ చేసిన శంక‌ర్‌..ఈ సారి మాత్రం రాంచ‌ర‌ణ్ కోసం భారీ మొత్తంలో ఖ‌ర్చుపెడుతూ క‌ల‌ర్‌ఫుల్‌గా వ‌చ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని సమాచారం.

ఇక ఈ సినిమాకు ఇంత వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం స‌ర్కారోడు వ‌ర్కింగ్ టైటిల్‌ గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ  కియారా అద్వానీ నటిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios