మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ సీ 15 షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇంతకీ ఈ మూవీ షూటింగ్ ఎంత వరకూ వచ్చింది..? ఎంత కంప్లీట్ అయ్యింది.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ , శంకర్ కాంబినేషన్ లో.. ఆర్ సి15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది పాన్ ఇండియా మూవీ. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. శంకర్ ఈ మూవీ షూటింగ్ ను నెగ్లెట్ చేస్తున్నాడు అని విమర్షలు వస్తున్న వేళ.. ఈమూవీ ని స్పీడప్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు శంకర్ షూటింగ్ స్పాట్ లోకి రాకుండా అసిస్టెంట్స్ తో మానేజ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఏపీలోని రాజమండ్రి, రంపచోడవరం ప్రాంతంలో రామ్ చరణ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. లీడ్ యాక్టర్లు రాంచరణ్, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత టీం కాకినాడలో షూటింగ్ చేయనున్నారు. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈసినిమా షూటింగ్‌కు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శంకర్ భారతీయుడు2 మూవీ మీద ఎక్కువ హోప్స్ పెట్టకోవడంతో.. దాదాపు 60 పర్సంట్ కంప్లీట్ అయిన ఈ సినిమాను అసిస్టెంట్స్ కు వదిలేశాడని. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
అంతే కాదు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. వీరితో పాటు యంట్ స్టార్ నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 5 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ రామ్ చరణ్ జోడీగా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రెండు మూడు టైటిల్స్ ను అనుకున్నారట. సర్కారోడు టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. మరి శంకర్ టీమ్ టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు శంకర్. మరి ఈసినిమాతో అయిన సాలిడ్ హిట్ కొడతాడా..? లేక రామ్ చరణ్ ను చిక్కుల్లో పడేస్తాడా అనేది చూడాలి. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. కాని ఆతరువాత ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. దిల్ రాజు హోంబ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
