నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో.. మేం ఉండం.. రామ్‌చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. టార్గెట్ రోజానా?
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు రామ్‌చరణ్. నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో, మేం క్వైట్‌గా ఉండమని చెప్పారు. అటు ప్రత్యర్థులకు, కొందరు నిర్మాతలకు రామ్‌చరణ్ సక్సెస్ సెలబ్రేషన్ వేదికగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు రామ్‌చరణ్. నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో, మేం క్వైట్‌గా ఉండమని చెప్పారు. హన్మకొండలో శనివారం సాయంత్రం జరిగిన `వాల్తేర్ వీరయ్య` విజయ విహారం సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ప్రత్యర్థులకు, కొందరు నిర్మాతలకు రామ్‌చరణ్ సక్సెస్ సెలబ్రేషన్ వేదికగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంకా రామ్‌చరణ్ మాట్లాడుతూ, నాన్నగారు(చిరంజీవి) క్వైట్‌గా ఉంటేనే ఇంత మంది వచ్చాం. అదే ఆయన గట్టిగా బిగించి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. చిరంజీవిగారు సైలెంట్‌గా ఉంటారేమో తాము ఉండబోమని తెలిపారు చరణ్. ఆయన ఇలాంటి సంచలన కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు చురకలంటించారు చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిలు ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూజర్లు అని, ఎంతో ఇష్టంతో, డెడికేషన్‌తో సినిమాలు చేస్తారని, వారిలా ఎవరూ చేయలేరన్నారు. వారి బ్యానర్‌లో పనిచేసిన అందరికి హిట్లు ఇచ్చారని తెలిపారు. కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది తెలుసుకోవాలని చురకలంటించడం విశేషం.
`అలాగే వాల్తేర్ వీరయ్య` లాంటి అద్భుతమైన సినిమాని అందించిన దర్శకుడు బాబీకి థ్యాంక్స్ చెప్పారు రామ్‌చరణ్. సినిమాని ఓ ఫ్యాన్ బాయ్‌గా చూసి ఎంజాయ్ చేశామన్నారు. పూనకాలు లోడింగ్ అనేలానే సినిమా ఉందన్నారు. నాన్నగారు సినిమాలో ఓ బ్రదర్‌లా అనిపించారని, అంత యంగ్‌గా చూపించారని తెలిపారు. మూడు అద్భుతమైన పాటలు అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి అభినందనలు తెలిపారు చరణ్.
మరోవైపు సినిమాలో రవితేజ పాత్ర అద్భుతంగా ఉందని, ఆయన్ని ఓ సీరియస్ రోల్‌లో బాగా చూపించి కన్విన్స్ చేశారని, ఆయన పాత్ర ఇంకా లేదనే అసంతృప్తి ఉందని, దీంతో `ధమాకా` చూసినట్టు తెలిపారు చరణ్. ఇందులో నాన్నగారి రవితేజ పాత్ర `హలో బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి` అనే డైలాగ్ తమ్ముడులాంటి రవితేజ అనగలిగాడు, దాన్నీ తీసుకోగలిగాం. అదే వేరే వాళ్లు అని ఉంటేనే తీసుకునేవాళ్లం కాదన్నారు, అలా కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ కి మాత్రమే అనే హక్కు ఉందన్నారు.
ఇదిలా ఉంటే రామ్‌చరణ్ వార్నింగ్ ఎవరికి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు ఏపీ పొలిటికల్ లీడర్స్ కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి రామ్‌చరణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తుంది. మొత్తంగా తన స్పీచ్‌తో `వాల్తేర్ వీరయ్య` విజయ విహారం ఈవెంట్‌లో హాట్ హాట్‌గా మార్చేశారు.