రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని తలచుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరంటే నమ్మను అని, నమ్మలేనని, ఆయన లేరనే వార్త నిజం కాదని అన్నారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌(RRR Pre Release Event) ఈవెంట్‌ గ్రాండ్‌గా జరుగుతుంది. భారీగా ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులు తరలి రావడంతో `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) ఈవెంట్‌ పోటెత్తిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోవడం విశేం. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ (Ram Charan) మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ని తలచుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మన మధ్య లేరంటే నమ్మను అని, నమ్మలేనని, ఆయన లేరనే వార్త నిజం కాదని అన్నారు. ఆయన మన మధ్యే ఉన్నారని, ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటామన్నారు. శివరాజ్‌కుమార్‌లో ఆయన్ని చూసుకుంటామని తెలిపారు. శివరాజ్‌కుమార్‌ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని, తెలిపారు. ఈ సందర్భంగా సీఎం బసవరాజు బొమ్మైకి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు అద్భుతమైన పాటలు అందించిన ఎంఎం కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన సారథ్యంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు చరణ్‌. అలాగే ఈ వేడుకని వచ్చి ఇంతటి సక్సెస్‌ చేసిన ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మెగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు రామ్‌చరణ్‌. ఒక నీడ లాగా నాకు, తారక్‌కి అండగా ఉన్నారని చెప్పారు. 

ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విషయంలో జీరో ఫీలింగ్‌తో ఉన్నా. ఎలా ఉంటుందో చూడాలన్నారు. నిర్మాత దానయ్యకి, రాజమౌళి టీమ్‌ అందరికి ధన్యవాదాలు తెలిపారు చరణ్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మించారు. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.