ప్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు ప్రత్యేక గౌరవం దక్కింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి చెర్రీని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ తండ్రీకొడుకుల ప్రేమానురాగం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మాారింది.  

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. ‘రంగస్థలం’ నుంచి అభిమాన గణాన్ని కూడా పెంచుకుంటున్న చెర్రీ.. ప్రస్తుతం సౌత్, నార్త్ లో గట్టి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మరోవైపు విభిన్న కథలను ఎంచుకుంటూ భారీ చిత్రాల్లో నటిస్తున్న చరణ్ కు తాజాగా మరో అవార్డు దక్కింది. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన కొందరు ప్రముఖులకు ఓ ఇంగ్లీష్ పత్రికా సంస్థ ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ (Future of young India) అవార్డులను ప్రధానం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా రామ్ చరణ్ ను ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో ‘ట్రూ లెజెండ్’గా గుర్తిస్తూ అవార్డును అందిస్తున్నారు. కార్యక్రమంలో చెర్రీ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నాని తెలిపారు.. అదేవిధ:గా చిరు సేవలనూ కొనియాడు. దీనిపై చిరంజీవి కూడా స్పందించారు. రామ్ చరణ్ ఎదుగుతున్న తీరుపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు...

చరణ్ ను ఉద్దేశిస్తూ చిరు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘నాన్న చరణ్.. నీవు ట్రూ లెజెండ్ గా ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ’ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. ఇంకా ఎత్తుకు ఎదగాలని నీ తల్లిదండ్రులుగా అమ్మా నేను ఆకాంక్షిస్తున్నాం.’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చరణ్ ఎదుగుతున్న తీరుకు మురిసిపోతూ రేర్ ఫొటోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, చిరు ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు చరణ్ కూడా స్పందిస్తూ ‘లవ్ యూ అప్పా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ తండ్రీకొడుకుల ప్రేమకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్సీ’లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చెర్రీకి జోడీగా నటిస్తోంది. ఇటీవలనే చిత్రం న్యూజిలాండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ఇండియా చేరింది. శరవేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది. త్వరలో షూటింగ్ పార్ట్ పూర్తికానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా ‘ఆర్సీ16’ను సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదికి వెళ్లనుంది.

Scroll to load tweet…