క్రాక్ తో రవితేజ సాలిడ్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే క్రాక్ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. విడుదలైన అన్ని ప్రాంతాలలో అద్భుత వసూళ్లను ఈ మూవీ సాధిస్తుంది. విడుదల రోజు అనేక ఇబ్బందుల పాలై ఈవెనింగ్ షోస్ తో మొదలైన క్రాక్... లేటుగా వచ్చినా  లేటెస్ట్ గా సత్తా చాటింది. 

రవితేజ మాస్ పెర్ఫార్మన్స్ కి అన్ని వర్గాల నుండి ప్రసంశలు దక్కుతున్నాయి. విడుదలైన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ మూవీ గురించి చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రాక్ మూవీ సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు. 

''నా ఫేవరేట్ హీరో రవితేజ గారు టాప్ ఫార్మ్ చూపించారు. శృతి హాసన్ ఉత్తమ నటన కనబరిచారు. సముద్ర ఖని, వరలక్ష్మీ పాత్రలను పోషించిన తీరు అద్భుతం. థమన్ బీజీఎమ్, దర్శకుడు గోపీచంద్ టేకింగ్ టాప్ క్లాస్.. క్రాక్ మూవీని ఆద్యంతం ఆస్వాదించాను'' అని రవితేజ ట్విట్టర్ లో పేర్కొన్నారు. రామ్ చరణ్ క్రాక్ మూవీ పట్ల స్పందించిన తీరుకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలుపుతున్నారు.