టాలీవుడ్‌లో క్రమంగా షూటింగ్‌లు ఊపందుకుంటున్నాయి. వరుసగా స్టార్‌ హీరోలు బరిలోకి దిగుతున్నారు. కరోనా భయాలను ఛేదించుకుని సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు ధైర్యం చూపుతున్నారు. నాగార్జున ఇప్పటికే `బిగ్‌బాస్‌ 4`, అలాగే ఆయన నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` సినిమా షూటింగ్‌లు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన స్పూర్తితో తనయుడు నాగచైతన్య తాను నటిస్తున్న `లవ్‌ స్టోరి` సినిమాని కంప్లీట్‌ చేసే పనిలో పడ్డారు. 

బుధవారం మహేష్‌ ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు త్వరలోనే తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి `ఆచార్య` కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలని నిర్ణయించారు. 

అయితే చిరంజీవి ఇప్పుడే ఈ షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ లేదని, కీలక పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌పై షూటింగ్‌ జరుపబోతున్నారని టాక్‌. చరణ్‌ మరోవైపు `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటించాల్సి ఉంది. అది అక్టోబర్‌లో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ లోపు `ఆచార్య`లోని తన షూటింగ్‌ని కంప్లీట్‌ చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందులో కేవలం ముప్పై మంది వరకే చిత్ర బృంద సభ్యులుండేలా ప్లాన్‌ చేస్తున్నారట. అయితే చరణ్‌ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొనబోతున్నారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

చిరంజీవికి జోడీగా కాజల్‌ నటిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ జోడి ఎంపిక జరుగుతుంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది.