మెగాస్టార్ చిరంజీవికు చెందిన  ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండ దగ్గర కోకా పేటలో ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవికు చెందిన ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండ దగ్గర కోకా పేటలో ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగామంటలు ఎగసిపడ్డాయి. 'సై రా' సినిమా షూటింగ్ కోసం ఫాంహౌజ్‌లో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు.

ఆ సెట్ మొత్తం అగ్నిప్రమాదం కారణంగా కాలిపోయింది. ఈ విషయంపై చిత్ర నిర్మాత రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కోకాపేటలో వేసిన 'సై రా' సెట్ ఈ ఉదయం దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుందని, ఈ ఘటనలో ఏ ఒక్కరికీ ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

చిత్రబృందం మొత్తం క్షేమంగా ఉన్నారని తెలిపారు. చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ఫేస్ బుక్ ద్వారా విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో సైరా.. నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది.