Asianet News TeluguAsianet News Telugu

ధోనీని కలిసిన రామ్ చరణ్.. ఎందుకు? వైరల్ గా మారిన పిక్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Ram Charan Meets MS Dhoni in mubai NSK
Author
First Published Oct 4, 2023, 4:22 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నిన్నముంబైలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ఓ క్రేజీ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (Ms Dhoni) , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది.

ఈరోజు ఉదయం రామ్ చరణ్ ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక టెంపుల్ ను సందర్భించారు. అయ్యప్ప మాల విరమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అర్చకులు, ఆలయ సిబ్బంది చరణ్ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. వినాయకుని దర్శనం అనంతరం.. శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీటితో పాటు ఎంఎస్ ధోనీ, చరణ్ కలిసి ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది.

ఆ ఫొటో చూసిన ధోనీ అభిమానులు, చరణ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇద్దరు స్టార్స్ ఓకే ఫ్రేమ్ లో మెరియడంతో మురిసిపోతున్నారు. అయితే వీరిద్దరు ఎందుకు కలిశారనే దానిపై ఆరా తీయగా.. ఓ కమర్షియల్ యాడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే చరణ్, ధోనీ కలిశారని సమాచారం. ఏదేమైనా ఈరోజు బెస్ట్ పిక్ గా మిగిలింది. ఈ షూట్ తర్వాత చరణ్ హైదరాబాద్ కు రానున్నారు. 

ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది. శంకర్ ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్డడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. త్వరలో షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Ram Charan Meets MS Dhoni in mubai NSK

Follow Us:
Download App:
  • android
  • ios