Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్‌ని లాంచ్‌ చేసిన రామ్‌చరణ్‌.. స్పెషాలిటీ ఏంటంటే..

సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం `Chiranjeevi Charitable Trust` పేరుతో ఓ వెబ్‌ సైట్‌ని ప్రారంభించారు. 

ram charan launched chiranjeevi charitable trust website
Author
Hyderabad, First Published Oct 18, 2021, 3:08 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ పేరుతో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లని ఈ ట్రస్ట్ ద్వారానే అందించారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్స్ ని అందించారు. అనేక మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు. అంతేకాదు కొన్నేళ్లుగా బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా, ఐ బ్యాంక్‌ ద్వారా సేవ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం `Chiranjeevi Charitable Trust` పేరుతో ఓ వెబ్‌ సైట్‌ని ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లోని బ్లడ్‌ బ్యాంక్‌ ఆఫీస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్‌(Ram Charan) ఈ వెబ్‌ సైట్‌ని లాంచ్‌ చేశారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్‌ సైట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. నేటి నుంచి ఈ వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, మరిన్ని ప్రాంతాలకు ట్రస్ట్ సేవల్ని విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు రామ్ చరణ్ తెలిపారు. చిరంజీవి చిత్రసీమలోకి అడుగుపెట్టి.. స్టార్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. `kchiranjeevi.com` పేరుతో ప్రస్తుతం ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి నటించిన 150 సినిమాల సమాచారం, పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న రిలేషన్  గురించి సమాచారం ఇందులో లభ్యమవుతుంది. 

also read: ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి

ఇదిలా ఉంటే కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో `కరోనా క్రైసిస్‌ చారిటీ` పేరుతోనూ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. దీనికి Chiranjeevi ముఖ్య భూమిక పోషించారు. ఇక సినిమాల పరంగా చూస్తే చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. మరోవైపు ఇప్పుడు `గాడ్‌ఫాదర్‌`, `భోళాశంకర్` చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios