రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్రంనుంచి ఓ కీలక సీన్‌ లీక్‌ అయ్యింది. వైరల్‌ అవుతుంది.  

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవల వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు లీక్‌ అయ్యాయి. పబ్లిక్‌ మీటింగ్‌ కి సంబంధించిన సీన్లు చిత్రీకరించడంతో రామ్‌ చరణ్‌ లుక్‌ బయటకు వచ్చింది. ఇందులో రామ్‌ చరణ్‌ టక్‌ ధరించి ఓ అధికారిలా కనిపించారు. ఈ మూవీలో రామ్‌ చరణ్‌ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి ఐఏఎస్‌ రోల్‌. 

రామ్‌ నందన్‌ పాత్ర ఐఏఎస్‌ది అని తెలుస్తుంది. ఈ పాత్రకి సంబంధించిన సన్నివేశాలనే వైజాగ్‌లో చిత్రీకరించారట. తాజాగా ఈ షూటింగ్‌కి సంబంధించిన ఓ సీన్‌ లీక్‌ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో పబ్లిక్‌ మీటింగ్‌ జరుగుతుంది. ఓ రాజకీయ నాయకుడు ఓ ఫైల్‌ని స్టేజ్‌పైనుంచే విసిరేశాడు. ఆ పక్కనే ఉన్న రామ్‌ చరణ్‌ని తోసేశాను. అంతేకాదు ఇద్దరు లేడీస్‌ ఉన్నారు. వారిని కూడా స్టేజ్‌పై నుంచే తోసేశాడు. కాసేపు హంగామా చేశాడు. 

పబ్లిక్‌ మీటింగ్‌ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐఏఎస్‌గా రామ్‌ చరణ్‌ కనిపించారు. విలన్‌ అంతగా రెచ్చిపోతున్న ఆయన మాత్రం ఏం చేయలేని స్థితిలో కనిపించడం విశేషం. చూడబోతుంటే సినిమాలో ఇది చాలా కీలకమైన సన్నివేశంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 

ఇక శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌`లో రామ్‌ చరణ్‌తోపాటు శ్రీకాంత్‌, ఎస్‌ జేసూర్య, నవీన్‌ చంద్ర, సునీల్‌, అంజలి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఇందులో చరణ్‌.. రాజకీయ నాయకుడు అప్పన్నగా, ఐఏఎస్‌ రామ్‌ నందన్‌గా కనిపిస్తారట. తండ్రి స్థాపించిన పార్టీని విలన్లు కుట్ర చేసి లాక్కుంటారని, ఆ విషయం తెలిసి వారిని అప్పన్న కొడుకైనా రామ్‌ నందన్‌ ఎలా పోరాడాడు, వారి ఆట ఎలా కట్టించారనేది ఈ మూవీ కథ అని తెలుస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Scroll to load tweet…

రేపు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి తొలి పాట `జరగండి జరగండి`ని విడుదల చేయబోతున్నారు. అలాగే మరో కొత్త పోస్టర్‌ కూడా రాబోతుందట. అంతేకాదు రేపు చరణ్‌ నటించిన `మగధీర` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఆ మూవీ ప్రదర్శనలోనే `జరగండి` పాటని థియేటర్లో ప్రదర్శిస్తారని సమాచారం.