చిరంజీవి తాజా చిత్రం ఆచార్యకు ..ఆయన కుమారుడు రామ్ చరణ్ కేవలం ప్యాసివ్ ప్రొడ్యూసరే అని, డబ్బు పెట్టకుండా లాభం తీసుకెళ్తున్నాడని మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు,గాసిప్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ట్నైమెంట్స్ కు చేరుకున్నాయి. వారు వెంటనే ఖండించారు. ఈ మేరకు వారో ప్రకటన రిలీజ్ చేసారు. ఆ ప్రకటనలో ఏముందంటే..

“రామ్ చరణ్ కు సంభందించిన కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, మరియు రామ్ చరణ్ పూర్తిగా మా సంస్ద నిర్మిస్తున్న చిత్రంతో సమానంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రొడక్షన్ కు సంభందించిన డిస్కషన్స్,మానటరీ కంట్రిబ్యూషన్స్,ప్రొడక్షన్ అన్నీ సమానంగా మా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పంచుకుంటారు. ఈ రెండు సంస్దలు కలిసి సమానంగా పనిచేస్తాయి. ఈ క్రమంలో ఎవరే డ్యూటీలు చేయాలి, ఎవరు ఏ రెస్పాన్సబులిటీలు తీసుకోవాలనే విషయం డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ ప్రకారమే సినిమా నిర్మాణం జరుగుతుంది” అని తెలియచేసారు.
  
ఇక చిరంజీవితో వరుసగా 'ఖైదీ నంబర్ 150', 'సైరా' చిత్రాలను నిర్మించిన రామ్‌ చరణ్.. ఇప్పుడు 'ఆచార్య'ను కూడా నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మరో నిర్మాతగా వ్యవహరిస్తుంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ ...తానే 'ఆచార్య'లో సెకండాఫ్ లో వచ్చే లెంగ్తీ పాత్రలో అలరింనున్నారు. ఆ విధంగా 'ఆచార్య' బడ్జెట్‌ను 30 కోట్లు కంట్రోల్ చేయొచ్చనే ప్లాన్ అని తెలుస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిరు 'ఆచార్య'లో.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.