మెగా అభిమానులకు గుడ్ న్యూస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే ఆయన ఎంట్రీ ప్లేయర్ గా మాత్రం కాదు అంటున్నారు.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నా ఈన్యూస్ లో నిజం ఎంతా..? అసలు చరణ్ ఎంట్రీ ఎలా జరగబోతోంది. 


ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబర్ స్టార్ గా అవతరిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారడంతోపాటు.. హాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ప్రశంసలు పొందారు. అటు సినిమాలతో పాటు.. ఇటు బిజినెస్ మెన్ గా కూడా రామ్ చరణ్ సక్సెస్ ఫులు లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఎన్నో బిజీనెస్ లు ఉన్నాయి. వాటి నుంచి కొట్లలో ఇన్ కమ్ పొందుతున్నారు చరణ్. అటు ఉపసాన కూడా అపోలో హాస్పిటల్స్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈక్రమంలో రామ్ చరణ్ మరో బిజినెస్ లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. 

క్రికెట్ కు , సినమా ఇండస్ట్రీకి విడదీయలేని బంధం ఉంది. సినిమా తారలను క్రికెటర్లు పెళ్ళి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ. ఇక స్టార్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తున్న క్రికెటర్లుకూడా ఉన్నారు. కొంత మంది క్రికెటర్లు స్టార్స్ తో కలిసి ఆడ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. ఇటు సినిమా తారలు కూడా క్రికెటర్లతో మంచి సబంధాలు కలిగి ఉన్నారు. ఇండస్ట్రీలోకూడా ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ లు పెడుతుంటారు. ఇక ఈక్రమంలో సినిమా తారలు క్రికెట్ నుంచి బిజినెస్ చేసేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్ లో టీమ్స్ ను కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. షారుఖ్, ప్రీతి జింతా లాంటి స్టార్స్ కు ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి. ఇక ఈరంగంలోకి తాజాగా అడుగుపెట్టబోతున్నాడు.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 

రామ్ చరణ్ ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నారు.టీమ్ ఫ్రాంచైజీగా ఉండబోతున్నాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో అవును ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక్క టీమ్ కూడా లేదు. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ లా.. ఏపీ నుంచి కూడా ఒక టీమ్ ఐపీఎల్ లో బరిలోకి దింపాలని రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యానని.. వచ్చే ఏడాది రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త టీమ్ ఐపీఎల్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. 

ఇక ఈ టీమ్ కు పేరు కూడా ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ టీమ్ కి వైజాగ్ వారియర్స్ పేరు పెట్టినట్లు సమాచారం. నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఈక్రమంలో ఐపీఎల్ టీమ్ ను తీసుకోవడం ద్వారా రామ్ చరణ్ మరో మొట్టు ఎక్కినట్టు అవుతుంది. అయితే ఈ న్యూస్ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. త్వరలో చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో రూమర్ గానే ఉంది. 

ఇక ప్రస్తుతానికి సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్.. శంకర్ సినిమా తరువాత బుచ్చిబాబుతో మరో భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడు. ఇక శంకర్ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి.. ఉపాసనతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నాడు చరణ్. ఉపసాన మెగా వారసుడికి జన్మనివ్వబోతుండటంతో.. చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది.