మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన న్యూ హార్స్ ను పరిచయం చేశారు. తన కొత్త ఫ్రెండ్ అంటూ.. కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం ముంబైలో ల్యాండ్ అయ్యారు.  

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. దీంతో చరణ్ ప్రతి కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. అలాగే చెర్రీ తన అభిమానులకూ ఎగ్జైటింగ్ న్యూస్ లు చెబుతూ.. ఇంట్రెస్టింగ్ పోస్టులతోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో చరణ్ తన న్యూ హార్స్ ను పరిచయం చేశారు. దానితో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బ్లాక్ కలర్ లో ఉన్న గుర్రాన్ని తన న్యూ ఫ్రెండ్ అంటూ ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. దానికి Blaze అని పేరు కూడా పెట్టారు. రామ్ చరణ్ కు హార్స్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అందులో చిన్నవయస్సులోనే శిక్షణ కూడా పొందారు. అప్పటి నుంచే గుర్రాల పెంపకంపై చరణ్ కు మక్కువ పెరగింది. చరణ్ నటించిన ‘మగధీర’లో ఉన్న గుర్రం కూడా చరణ్ దేనంట. దాని పేరు కాజల్ అని కూడా చెబుతుంటారు. రామ్ చరణ్ కు పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి చరణ్ హార్స్ పై చూపించే ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇక చరణ్ బ్లాక్ టీషర్ట్, సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. సింపుల్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం Game Changer. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే బుచ్చిబాబు సానాతోనూ RC16ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే అధికారికంగా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో ల్యాండ్ అయ్యారు. ప్రతి యేటా ఆయన అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో నిష్టగా అయ్యప్పను పూజిస్తుంటారు. మాలలోనే తన సినిమా పనులపై ప్రయాణిస్తుంటారు కూడా. ఇక తాజాగా ముంబైలోని ఎయిర్ పోర్టులో మాలలో కనిపించారు. ఓ యాడ్ షూట్ కోసం అక్కడికి వెళ్లారని తెలుస్తోంది. అలాగే రేపు సిద్దివినాయక్ టెంపుల్ ను కూడా దర్శించనున్నారంట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Scroll to load tweet…