మలహాసన్ తన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో 'విక్రమ్' సినిమాను నిర్మించారు. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. 

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విక్రమ్‌’. తమిళ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాడు. విడుదలైన తొలి రోజే రూ. 45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్‌ నిన్నటితో(జూన్‌ 6న) రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ప్రాఛైజీ గురించిన హాట్ టాపిక్ ఇండస్ట్రీలో మొదలైంది. తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మెగా హిరోకు ఛాన్స్ ఉండబోతోందని వినికిడి. ఇంతకీ ఎవరా మెగా హీరో...?

విక్రమ్ సినిమా తెలుగులో కూడా బాగా వర్కవుట్ కావటంతో నెక్ట్స్ ప్రాజెక్టుకు తెలుగు నుంచి హీరోని తీసుకోవాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ ని ఈ మేరకు ఈ ప్రాచైజీకు అడిగే అవకాసం ఉందంటున్నారు. ఇప్పుడు వచ్చిన విక్రమ్ సినిమాలో కమల్ మనవడు పాత్ర పెద్దవాడైన తర్వాత రామ్ చరణ్ అవుతాడని కథ ఉంటుందని చెప్తున్నారు. సూర్య విలన్ గా చేస్తారు, రామ్ చరణ్ హీరోగా చేస్తాడని చెప్తున్నారు. ఇంతకు ముంది లోకేష్ కనకరాజ్ ..ఓ కథను రామ్ చరణ్ కు నేరేట్ చేసారు. అయితే కథ ఓకే కాలేదు. ఆ ప్లేస్ లోనే ఈ మెగా హీరో ..శంకర్ సినిమా చేస్తున్నారు.

ఇక కమలహాసన్ తన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో 'విక్రమ్' సినిమాను నిర్మించారు. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌' పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు. ఇందులో కమల్‌ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్‌ హీరోలకు పోటీగా యాక్షన్‌ సీన్స్‌ చేయడం విశేషం. 

ఇంత పెద్ద ప్రాజెక్టును ఆయన కేవలం మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి అప్పగించడం విశేషం. అయితే లోకేశ్ చేసిన ఆ మూడు సినిమాలు కూడా హిట్టే. ఆ మూడు సినిమాల్లో 'ఖైదీ' .. 'మాస్టర్' సంచలన విజయాలను సాధించాయి. ముఖ్యంగా 'ఖైదీ' సినిమా స్క్రీన్ ప్లే అందరినీ ఆశ్చర్య పరిచింది. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన 'విక్రమ్' సినిమాపై భారీ అంచనాలు ఉండటం కలిసొచ్చింది. లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది .