ఇప్పుడు లేటెస్ట్ గా ఓ అదిరిపోయే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరణ్‌ బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నాడట. అది పాపులర్‌ ఫ్రాంఛైజీ `ధూమ్‌ 4` అని తెలుస్తుంది. 

రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ ట్యాగ్‌తో రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. దాన్ని మెయింటేన్‌ చేస్తూ వస్తున్నాడు చరణ్‌. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. `గేమ్‌ ఛేంజర్‌` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్‌ చాలా నిదానంగా సాగుతుంది. ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

రామ్‌చరణ్‌ నెక్ట్స్ `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్‌చరణ్‌కి సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. రామ్‌చరణ్‌ బాలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తున్నారట. `తుఫాన్‌` చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు చరణ్. కానీ ఈ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమాలో ఓ పాటలో మెరిశాడు చరణ్‌. ఆ సినిమా పరాజయం చెందింది. 

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఓ అదిరిపోయే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరణ్‌ బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నాడట. అది పాపులర్‌ ఫ్రాంఛైజీ `ధూమ్‌ 4` అని తెలుస్తుంది. 2013లో వచ్చిన `ధూమ్‌ 3` చిత్రానికి ఇప్పుడు నాలుగో సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే హీరోగా షారూఖ్‌ ఖాన్‌ నటిస్తారని అంటున్నారు. పోలీస్‌ పాత్ర కోసం రామ్‌చరణ్‌ని అడుగుతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్‌. గత సినిమాని రూపొందించిన విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ షారూఖ్‌ని ఈ ప్రాజెక్ట్ గురించి అప్రోచ్‌ కాలేదని బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. అయితే ఇవన్నీ గాలి వార్తలేనా? నిజం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.