డైరక్టర్ వంశీ పైడిపల్లి మొత్తానికి ఓ స్టార్ హీరోని తన స్టోరీ లైన్ తో ఒప్పించాడు. మొదట మహేష్ తో అనుకున్నా అది పట్టాలు ఎక్కలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ..మహేష్ స్క్రిప్టు నచ్చలేదని వద్దన్నాడు. దాంతో ఆ స్క్రిప్టు ని మిగతా స్టార్స్ కి వినిపించాడు. ఎన్టీఆర్ తో చేస్తాడని ఓ టైమ్ లో వినిపించింది. అయితే అదీ ముందుకు వెళ్ళలేదు. దాంతో ఆ కథని ప్రక్కన పెట్టి వేరే కథని వండినట్లు సమాచారం. ఆ కథతో రామ్ చరణ్ ని ఒప్పించారని తెలుస్తోంది.
 
రామ్ చరణ్ ఈ కథ విని ఆర్ ఆర్ ఆర్ తర్వాత వెంటనే చేయదగ్గ ప్రాజెక్టు ఇదేనని ఫీలయ్యారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య తర్వాత చేయబోయే సినిమా ఇదే. మొత్తానికి వంశీ పైడిపల్లి ...టెన్షన్ నుంచి బయిటపడ్డారు. ఎందుకంటే మహర్షి వచ్చి చాలా కాలం అవుతోంది. మరో సినిమాకు గ్యాప్ వచ్చేటట్లుంది. దాన్ని రామ్ చరణ్ తో భర్తీ చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.
 
ఇక ఈ సినిమాని దిల్ రాజు కానీ, కొనిదెల ప్రొడక్షన్స్ కానీ టేకప్ చేస్తాయి. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు వంటి సూపర్ హిట్ రావటంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఈ సినిమాలోనూ మరో హీరో గెస్ట్ రోల్ ఉండబోతోందని తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలో బయిటకు రానున్నాయి.