.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు


రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం రావటం లేదు. ఈ నేపధ్యంలో ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమా ఇంకా చేయాల్సిన షూట్ 70 రోజుల వరకు వుందని. ఇంకా 70 రోజులు ఉందంటే ఇప్పటిదాకా ఏం చేసారు అని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, చిత్రీకరణ మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు చరణ్.

రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.

వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.

మరో ప్రక్క ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ చేంజర్ వీలైనంత తొందరగా పూర్తి చేసి 2024 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్. ఒకవేళ ఆ పండగ సీజన్ అందుకోకపోతే 2025 సంక్రాంతికి ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలి అని దిల్ రాజు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో దసరా సీజన్ కు స్లాట్ ఖాళీ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. 

స్టార్ డైరక్టర్ శంకర్‌ (S Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ గ్యాప్ తర్వాత ఇటీవలే ప్రారంభమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.

అలాగే రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన శంకర్ ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.