Asianet News TeluguAsianet News Telugu

#GameChanger:‘గేమ్‌ ఛేంజర్‌’ పెద్ద స్కెచ్చే , ‘సలార్’రూట్ లోనే రిలీజ్?

 తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  
 

Ram Charan #GameChanger locked for December 25!? jsp
Author
First Published Feb 29, 2024, 8:10 AM IST

రామ్ చరణ్ గత మూడేళ్ళుగా ఆపకుండా కంటిన్యూగా  చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయమై క్లారిటీ లేకుండా పోయింది.  దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మరో 30 శాతం మిగిలే ఉంది.  మొన్నటివరకు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి లాంగ్ గ్యాప్ తీసుకున్న చిత్రం యూనిట్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్  చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ కూడా  ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ సైతం క్రిస్మస్ శెలవులను ఫెరఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అదే రూట్ లో రాబోతోంది.  వాస్తవానికి గతేడాది దీపావళికే ఈ సినిమా నుంచి జరగండి అనే ఫస్ట్ సింగిల్ రానున్నట్లు చెప్పారు. దీనికోసం రామ్ చరణ్ కలర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఏమి జరిగిందో గానీ ఆ పాట కూడా బయటకు రాలేదు.  

 ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.

  చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు.
 
అలాగే అప్పట్లో శంకర్ గతంలో తీసిన “ఒకే ఒక్కడు” చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందిట. కార్తీక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథ కొత్తగా ఉండటమే కాకుండా మంచి మెసేజ్ ని మోసుకు వస్తుందంటున్నారు.  ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామికవాదులను, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకు బాగా నచ్చే అవకాసం ఉంది.
 
  రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios