#GameChanger ‘గేమ్‌ ఛేంజర్‌’కు ఒకే ఒక్క రిలీజ్ ఆప్షన్, ఆ రోజు దాటితే వచ్చే సమ్మరే?


ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.  మరో ప్రక్క ఈ సినిమా ఎప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ మాత్రం రావటం లేదు.

Ram Charan #GameChanger has only one release option and that is Christmas? jsp


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫూజన్ నడుస్తోంది.  దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికి రిలీజ్ డేట్ పై క్లార్టీ లేదు. తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు

ఇ క రీసెంట్ గా  దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ 2024 సెప్టెంబర్‌లో ఉంటుందని కన్ఫామ్ చేశారు. సలార్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన దిల్ రాజుని అభిమానులు ప్రశ్నించడంతో దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘They Call Him OG’వస్తూండటంతో గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో రావటం ప్రశ్నార్దకమే అంటున్నారు. 
 
 డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే గేమ్ ఛేంజర్ ఆలస్యానికి కారణం. అయితే ఇప్పుడు  ‘ఇండియన్ 2’ఆగస్ట్ 15 రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. పుష్ప2 వాయిదా పడితుందా లేదా అనే విషయమై ఈ రిలీజ్ డేట్ ఉండచ్చు. అలాగే ‘ఇండియన్ 2’ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ కు వస్తుంది. సెప్టెంబర్ 27న పవన్ సినిమా  OG వస్తుంది. దసరా కు దేవర వస్తుంది ..అలాగని నవంబర్ లో వద్దామంటే అప్పుడు సినిమాల రిలీజ్ కు సరైన టైమ్ కాదు. ఈ క్రమంలో 2024 క్రిస్మస్ మాత్రమే ఫెరఫెక్ట్ గా కనిపిస్తోంది అంటోంది ట్రేడ్.అది కనుక దాటితే మళ్లీ సంక్రాంతికి అన్ని సినిమాలు  ఫిక్స్ అయ్యిపోయాయి. దాంతో 2025 సమ్మర్ దాకా ఆగాల్సి ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ కి వస్తారా లేక ఈ లోగా ఎడ్జస్టమ్మెంట్స్ చేసి ఈ లోగా వస్తారా అని చూడాల్సి ఉంది. 
  
రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios