ఇటీవల చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించిన సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవసాత్తు ఈ యాక్సిడెంట్ లో ఎవరికీ ఏం కాలేదు. అయితే అగ్నిప్రమాదం ఎలా చోటుచేసుకుందనే విషయం తెలియరాలేదు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి కారణం షార్ట్ సర్క్యూట్ కాదని, సినిమా ప్రొడక్షన్ యూనిట్ అని కొన్ని మీడియా వర్గాలు వార్తలు ప్రచురించాయి. అగ్నిప్రమాదం జరిగితే ఇన్సూరన్స్ డబ్బులు వస్తాయని కావాలనే ఇలా చేశారని వార్తలు వినిపించాయి.

గతంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇలానే చేశాయి. ఇప్పుడు 'సై రా' విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. ఫాం హౌస్ లో వేసిన సెట్ లో షూటింగ్ పూర్తి కావడంతో కావాలనే ఫైర్ యాక్సిడెంట్ చేశారని అంటున్నారు. 

ఈ వార్తలు చరణ్ వరకు వెళ్లడంతో.. ''రెండు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్న నాకు ఒకట్రెండు కోట్ల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఏముందని'' ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి అగ్నిప్రమాదం కావాలని చేశారో.. లేక నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందో దర్శకనిర్మాతలకే తెలియాలి!