స్టార్స్ పై రూమర్స్ రావటం సహజమే కానీ, మరీ హద్దు మీరినప్పుడే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా పర్శనల్ విషయాలు, ఆరోగ్యానికి సంభందించిన రూమర్స్ వంటివి అందరినీ బాధిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఇబ్బందికరమైన పరిస్దితిని క్రియేట్ చేస్తాయి. రూమర్స్ చూసి స్టార్ నవ్వుకునేలా ఉండాలి కానీ వాళ్లను హర్ట్ చేస్తే కలిసొచ్చేదేమీ ఉండదు. ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే..రామ్ చరణ్ హెల్త్ పై వచ్చిన రూమర్ పై ఆయన్ని చాలా బాధించింది. 

వివరాల్లోకి వెళితే..‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం షూటింగ్‌లో ఆయన మరోసారి గాయపడ్డారని మంగళవారం పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. ఓ సన్నివేశం సాధన చేస్తున్న క్రమంలో చెర్రీ ప్రమాదవశాత్తు వెనక్కిపడ్డారని, దీంతో స్వల్పగాయమైందని రూమర్స్  వచ్చాయి. ఈ రూమర్స్ తో రామ్ చరణ్, ఆయన భార్య చాలా బాధపడ్డారట. మొదట ఉపాసన వాటిని విని వెంటనే ఫోన్ చేసిందని చెప్తున్నారు. అంతేకాదు చెర్రీ కుటుంబ సన్నిహితులు, ఆప్తులు ఫోన్స్ లో పలకరించారని , ఇంత హంగామాకు కారణమైన రూమర్స్ పై ఆయన మండిపడ్డారని సమాచారం. 

దాంతో వెంటనే  ఈ వార్తల్లో నిజంలేదని రామ్ చరణ్ కు చెందిన స్పోక్స్ పర్శన్ మీడియాకు తేల్చి తెలియచేసారు. చెర్రీ ఆరోగ్య పరిస్థితి బాగుందని వెల్లడించారు. అలాగే రామ్ చరణ్ సోమవారం, మంగళవారం షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపాయి. కొన్ని రోజుల క్రితం చరణ్‌ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న చెర్రీ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
 
ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.