ముంబైలో చరణ్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు.. మండు వేసవిలో 1000 మందికి అన్నదానం.. డిటేయిల్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు స్ఫూర్తివంతంగా నిలిచారు. మండు వేసవిలో సేవా కార్యక్రమాలు నిర్వహించి చరణ్ పై అభిమానాన్ని చాటుకున్నారు. 

Ram Charan fans Distribute buttermilk in summer NSK

‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ మారిపోయారు. దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నారు. సౌత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఇక నార్త్ లోనూ చెర్రీకి  అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. చరణ్ పై అభిమానం చాటుకునేందుకు ముంబైకి చెందిన ఫ్యాన్స్ తాజాగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ముంబై  అంధేరి , భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామ్‌చరణ్‌ అనగానే సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన గ్రేస్‌ ఎంత గొప్పగా గుర్తుకొస్తుందో, సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే ఘనంగా మదిలో మెదులుతాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్‌ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందిస్తూనే ఉన్నారు. 

పలు రకాలుగా పలువరు బాధితుకు కూడా అండగా నిలుస్తూనే ఉంటున్నారు. తనవంతుగా సాయం చేసి ఆదుకుంటూనే ఉన్నారు. అవన్నీ ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు సమాజానికి హితోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు. తమ స్టార్‌లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని, దయ, కరుణతో వ్యవహరించాలని, నలుగురిలోనూ స్ఫూర్తిపంచాలన్న ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఫ్యాన్స్. మజ్జిగ పంచడం అనేది తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు. 

Ram Charan fans Distribute buttermilk in summer NSK

సమాజంలో సాటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం పెరగాలంటే, కచ్చితంగా తమవంతు సాయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్‌ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ & అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్‌ పెడుతున్నారు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు. ఈ బృహత్కార్యాన్ని ఒక్క పదంలో చెప్పమంటే.. హార్ట్ వార్మింగ్‌ అని సవినయంగా చెబుతున్నారు చరణ్‌ సైన్యం. 

Ram Charan fans Distribute buttermilk in summer NSK

ప్రస్తుతం చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే  ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అద్వానీ కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా క్లైమాక్స్ షూట్ కూడా పూర్తైంది. త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం నుంది. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో ఆర్సీ16లో నటించబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios