`గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. చాలా రోజులుగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్‌ డేట్‌ కోసం ట్విట్టర్‌కెక్కారు చరణ్‌ ఫ్యాన్స్. నానా రచ్చ చేస్తున్నారు.

మెగాపవర్‌ స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా టర్న్ తీసుకుంటున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం గ్రాండియర్‌గా తెరకెక్కుతుంది. శంకర్‌ తన స్టయిల్‌ లావిష్‌ మేకింగ్‌తో ఈ సినిమాని తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టైటిల్‌ గ్లింప్స్ తప్ప మరేది రాలేదు. చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌ లాంటివేమీ లేవు. ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేసినా అందులో రామ్‌చరణ్‌ లుక్‌ విషయంలో ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు. 

ఆ తర్వాత ఈ సినిమా నుంచి మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. చాలా రోజులుగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్‌ హసన్‌ `ఇండియన్‌ 2`తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చరణ్‌ ఫ్యాన్స్ లోని అసంతృప్తి కట్టలు తెంచుకుంది. ఇక ఆగలేం అంటూ అప్‌డేట్ల కోసం గళమెత్తారు. సోషల్‌ మీడియా(ట్విట్టర్‌)ని వేదికగా చేసుకుని అప్‌డేట్‌ కోసం గొంతెత్తుతున్నారు. `మేలుకో శంకర్‌ సర్‌` (WAKE UP SHANKAR SIR) అనే ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. దర్శకుడు శంకర్‌ ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇకనైనా నిద్ర లేవమని, `గేమ్‌ ఛేంజర్‌ గ్లింప్స్`ని విడుదల చేయాలని రిక్వెస్ట్ తో కూడిన డిమాండ్‌ని ఆయన ముందుంచారు. 

అంతేకాదు ఇందులో నిర్మాత దిల్‌రాజుని సైతం లాగుతూ ఆయన్ని మరింతగా ఆడుకుంటున్నారు. `యూజ్‌లెస్‌దిల్‌రాజు షేమ్ లెస్‌ ఎస్వీసీ`(#UselessDilRajuShamelessSVC) అంటూ అప్‌ డేట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌ విషయంలోనూ అనుమానాలు నెలకొన్నాయి. సమ్మర్‌కి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కానీ ఇప్పుడు సమ్మర్‌ రేస్‌ నుంచి తప్పుకుంటుందని, షూటింగ్‌ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటంతో ఈ చిత్రం ఆగస్ట్ గానీ, దసరాకి గానీ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. 

పొలిటికల్‌ థ్రిల్లర్ గా ఈసినిమాని తెరకెక్కిస్తున్నారు శంకర్‌. రాజకీయాల్లో గేమ్‌ ఛేంజర్‌గా ఈ చిత్రం ఉండబోతుందట. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా రేంజ్‌ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల చరణ్‌ తండ్రి హోదా పొందిన విషయం తెలిసిందే. భార్య ఉపాసన ఇటీవలే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.