కొంత కాలంగా శంకర్ కథల ఎంపిక విషయంలో తడబడుతూనే ఉన్నారు. ఐ, 2.0 చిత్రాల విషయంలో ఇదే జరిగింది.
భారీ చిత్రాల దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. దాదాపు 28 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తీసుకువచ్చారు. నేడు థియేటర్స్ లో భారతీయుడు 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తొలి షో నుంచి భారతీయుడు 2 చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ మొదలైంది. అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శంకర్ టేకింగ్ విషయంలో ఎలాంటి సందేహాలు లేదు. కమల్ హాసన్ కూడా కథకి తగ్గట్లుగా నటించారు.
కానీ శంకర్ ఎంచుకున్న కథ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయ్యేలా లేదని టాక్ వస్తోంది. భారతీయుడు 2 చిత్ర పరిస్థితి ఇలా ఉండగా తర్వాత రాబోయేరాంచరణ్ గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. కొంత కాలంగా శంకర్ కథల ఎంపిక విషయంలో తడబడుతూనే ఉన్నారు.
ఐ, 2.0 చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలో రిపీట్ అయింది. పాత శంకర్ కనిపించడం లేదు అంటూ కామెంట్స్ మొదలైపోయాయి. దీనితో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శంకర్ ఎలా డీల్ చేసారో అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా గేమ్ ఛేంజర్ చిత్రం చరణ్ ఫ్యాన్స్ కి ఒక గండమే అని అంటున్నారు. ఈ గండం గడిస్తే చాలని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
