శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వార్తల్లో నిలవడం కాదు.. రాంచరణ్ ఫ్యాన్స్ తో చావుదెబ్బలు తిన్నాడు. సెలెబ్రిటీల గురించి నోటికిచ్చింది వాగుతూ పాపులారిటీ పొందిన సునిశిత్.. నోరు అదుపులో లేకపోవడంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వార్తల్లో నిలవడం కాదు.. రాంచరణ్ ఫ్యాన్స్ తో చావుదెబ్బలు తిన్నాడు. సెలెబ్రిటీల గురించి నోటికిచ్చింది వాగుతూ పాపులారిటీ పొందిన సునిశిత్.. నోరు అదుపులో లేకపోవడంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు కూడా సునిశిత్ పై నమోదయ్యాయి. 

అయినా సునిశిత్ తీరు మారలేదు. గతంలో లావణ్య త్రిపాఠి, రకుల్ లాంటి హీరోయిన్లపై సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వారితో ప్రేమలో ఉన్నట్లు.. వారు తనకు బాగా క్లోజ్ అయినట్లు బిల్డప్ కొట్టాడు. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది అన్నట్లుగా.. సునిశిత్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు హద్దులు దాటాయి. 

రీసెంట్ గా సునిశిత్ రాంచరణ్ సతీమణి ఉపాసనని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఉపాసనని కించపరిచేలా పర్సనల్ కామెంట్స్ చేశాడు. సునిశిత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఉపాసన నాకు ఫ్రెండ్. మేమిద్దరం గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. ఉపాసనకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా వెళ్లాం. 

Scroll to load tweet…

మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ వింటూ కొడతారు అని కూడా ఇంటర్వ్యూలో యాంకర్ వార్నింగ్ ఇచ్చింది. లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా తనతో ఉపాసనని పడేయ్ అని చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 

ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత చరణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? సునిశిత్ ని వెతికి పట్టుకుని చితకబాదారు. మా వదినమ్మని అంటావా అంటూ కొంతమంది చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ కి దేహశుద్ది చేశారు. అనంతరం సునిశిత్ తో క్షమాపణ చెప్పించారు. 

Scroll to load tweet…

ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నేను ఉపాసన గారి గురించి తప్పుగా మాట్లాడాను. ఇక మీదట ఏ సెలెబ్రిటీ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయను. ఉపాసన వదినమ్మ గారికి, రాంచరణ్ క్షమాపణ కోరుతున్నా. నేను చేసిన వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నా అంటూ సునిశిత్ చరణ్ ఫ్యాన్స్ అటాక్ తర్వాత వీడియో బైట్ లో పేర్కొన్నాడు. చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ని కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.