Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత రామ్ చరణ్ కు ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్న చిరంజీవి.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరువాత తాను అమితంగా గౌరవించే వ్యాక్తి పేరును ప్రస్తావించారు. ఇంతకీ చరణ్ ఏమాన్నారంటే. 

Ram Charan Comments On Bonding with Rajamouli and Chiranjeevi pawan kalyan
Author
First Published Mar 18, 2023, 9:46 AM IST

నాన్నచిరంజీవి.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరువాత తాను అమితంగా గౌరవించే వ్యక్తి  ఒక్క రాజమౌళినే అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  నాన్న..బాబాయ్ తనకు రెండు కళ్లని.. ఇద్దరిని తాను వేరువేరుగా చూడలేనన్నారు. రెండు కళ్లు మాదిరిగా నాన్న, బాబాయ్ నన్ను నడిపిస్తున్నారు అన్న చరణ్.. రాజమౌళి తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అన్నారు. ఆస్కార్ సాధించి వేడుకలు చేసుకున్న తరువాత ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ లో అడుగు పెట్టగా.. రామ్ చరణ్ మాత్రం సతీసమేతంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లైవ్ 2023 లో పాల్గొన్నారు చరణ్.  ఈసందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అంతకు ముందు ఢిల్లీలో దిగగానే..మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోం మంత్రి అమీత్ షాతో భేటీ అయ్యారు రామ్ చరణ్. దేశానికి ఆస్కార్ ను సాధించినందకు అమీత్ షా రామ్ చరణ్ ను సత్కరించారు. ఇక కాన్ క్లైవ్ లో మాట్లాడిన రామ్ చరణ్ ఆస్కార్ కు సబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈసదర్భంగా చరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్  సినిమా చేయాలి అనుకున్నప్పుడు తారక్ తో పాటు నన్నుసెలక్ట్ చేసుకోవడానికి కారణం..తమ మధ్య ఉన్న స్నేహమే అన్నారు. సినిమాలో పాత్రలు కూడా మంచి స్నేహితులు కావడం.. మా మధ్య ఉన్నస్నేహం కారణంగా ఈ పాత్రలకు తాము బాగా సెట్ అయ్యాం అన్నారు చరణ్. 

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు అన్నారు. ఇన్నేళ్ళ తెలుగు చలనచిత్రం చరిత్రలో.. ఆస్కార్ సాధించిన  ఘనత జక్కన్నకే దక్కుతుందని చెప్పారు. కొన్నిసినిమాలు నామినేషన్ వరకూ వెళ్ళి ఉండవచ్చు కాని.. ఆస్కార్ సాధించిన సినిమా మాత్రం లేదన్నారు చరణ్.  నాటు నాటు పాట ఆస్కార్ సాధిండం వెనుక చాలా మంది కష్టం ఉంది.. ముఖ్యంగా జక్కన్న స్వీట్ టార్చర్ పెట్టడం వల్లే మేము డాన్స్ చేయగలిగాం.. అయితే దానిని మేం ఎంజాయ్ చేశాం కాబట్టి.. అద్భుతమైన స్టెప్పులు వచ్చాయన్నారు చరణ్. 

ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్.. ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసుడు.. 14 ఏళ్ల క్రితం మగధీరతో నాకు లైఫ్ ఇచ్చారు.. పనిని ఆయన చాలా గౌరవిస్తారు. అందకే నాకు నాన్న, బాబయ్ తరువాత అంత ఇష్టమైన వ్యక్తి రాజమౌళి అన్నారు రామ్ చరణ్. ఇక మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య పోటీ గురించి కూడా ఆయన మాట్లాడారు.. దాదాపు 30 ఏళ్లకు పైగా తమ ఫ్యామిలీస్ మధ్య సినిమాల పరంగా పోటీ నడుస్తున్నా.. పర్సనల్ గా  తమ కుటుంబాల మధ్య అలాంటిది ఎప్పుడూ లేదన్నారు. తారక్ ను నన్ను కలిసి సినిమా చేయాలనే సాహసం రాజమౌళి మాత్రమే చేయగలిగాడు.. వేరే దర్శకులుఅయితే ఇది సాధ్యం అయ్యేదికాదేమో అన్నారు చరణ్. అంతే కాదు తాము కూడా రాజమౌళి మీద నమ్మకంతోనే అవకాశాన్ని తన చేతుల్లో పెట్టామన్నారు. నమ్మకాన్ని జక్కన్న నిలబెట్టారన్నారు.  ఇక ప్రస్తుతం చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  


 

Follow Us:
Download App:
  • android
  • ios