Asianet News TeluguAsianet News Telugu

`లియో`లో రామ్‌చరణ్‌.. ఎంట్రీ ఇచ్చేది అప్పుడే?

`లియో`లో విజయ్‌తోపాటు సంజయ్‌ దత్‌, అలాగే అర్జున్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంజయ్‌ దత్‌ది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. అయితే మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ram charan cameo in leo news viral what fact ? arj
Author
First Published Oct 11, 2023, 1:20 PM IST

దళపతి విజయ్‌ ప్రస్తుతం `లియో` చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ అంచనాలతో రాబోతుంది. త్రిష ఇందులో కథానాయికగా నటిస్తుంది. `ఖైదీ`, `విక్రమ్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ తర్వాత లోకేష్‌ రూపొందిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రం వచ్చే వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

ఈ సినిమా భారీ తారాగణంతో రాబోతుంది. ఇందులో విజయ్‌తోపాటు సంజయ్‌ దత్‌, అలాగే అర్జున్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంజయ్‌ దత్‌ది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. అయితే మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో మెగా పవర్‌ స్టార్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కనిపించబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆయనది చిన్న గెస్ట్ రోల్‌ అని తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. సినిమా చివరి నలబై నిమిషాల టైమ్‌లో వస్తుందని, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని టాక్‌. రామ్‌చరణ్‌పై సీన్లని కాశ్మీర్‌లో షూట్‌ చేశారట. 

అయితే ఇందులో నిజం లేదని కొందరు వాదిస్తున్నారు. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కావాలని సృష్టిస్తున్న రూమర్‌ ఇది అని, హైప్‌ పెంచేందుకు చేస్తున్నారని, కానీ ఇది ఏమాత్రం నిజం కాదని అంటున్నారు. దీంతో పెద్ద కన్‌ఫ్యూజన్‌ నెలకొంది. అయితే ఇటీవల రామ్‌చరణ్‌ని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కలిసిన నేపథ్యంలో ఈ రూమర్‌ ఊపందుకుంది. నిజంగానే చరణ్‌ ఎంట్రీ ఉంటుందా? ఉట్టి పుకారేనా? అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడే లాంగ్‌ షెడ్యూల్‌ ఉండబోతుందని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios