రామ్ చరణ్ క్లైమాక్స్ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడా ?నమ్మచ్చా రాజా
ఈ ఫిలిం టైటిల్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్ ఒకే సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్నాడు అంటే ఆ క్రేజే వేరు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ప్యాన్ ఇండియా లెవిల్ లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ని ఒప్పించి గెస్ట్ అప్పీరియన్స్ ఇప్పిస్తున్నారని తమిళ సినిమా వర్గాల సమాచారం. అయితే ఈ టాక్ ఇంతకు ముందు ఓ సారి వచ్చింది కానీ కొట్టిపారేసారు. కానీ నిజంగానే లియో చివర్లో కొద్ది నిముషాల పాటు కనిపిస్తాడని ప్రచారం మళ్లీ మొదలైంది. వివరాల్లోకి వెళితే..
విజయ్ హీరోగా రూపొందుతున్న ‘లియో’లో రామ్ చరణ్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. అదే సిరీస్‌లో ఇప్పుడు ‘లియో’ తీస్తున్నాడు. అందులో చివర్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారట. విక్రమ్ సినిమా చివర్లో సూర్య గెస్ట్ గా కనిపించినట్లు ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తాడంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ 'లియో'లో రామ్ చరణ్ నటించడం లేదనే వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఈ సినిమాని సెవెన్ స్టూడియోస్ సంస్థ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో విజయ్ కి తండ్రి పాత్రలో సంజయ్ కనిపిస్తారని చెప్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత ఆయన పూర్తిస్థాయి విలన్‌గా చేస్తున్నారు. సంజూ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఆయన రోల్‌కి సంబంధించిన గ్లింప్స్ వదిలారు. వీడియో సింప్లీ సూపర్బ్‌గా అనిపించడంతో పాటు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాక్సులు బద్దలయ్యేలా, గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక సంజూ లుక్, మేనరిజమ్స్, స్టైల్ అయితే అదిరిపోయాయి.
మరో ప్రక్క కమల్ హాసన్ ఈ సినిమాలో గెస్ట్ గా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ విషయంలో ఓ హింట్ ఇచ్చాడు. కమల్ పేరు డైరక్ట్ గా రివీల్ చేయనప్పటికీ ఒక గద్ద ఫోటో పెట్టి ‘ఈగల్ ఈజ్ కమింగ్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరిగ్గా ఇలాంటిదే ‘విక్రమ్’ సినిమాలోని థీమ్ సాంగ్‌లో కనిపిస్తుంది. పైగా ఈ పోస్ట్‌లో ట్రయాంగిల్ రెడ్ ఎమోజీని కూడా షేర్ చేశాడు. ఇది ‘విక్రమ్’ క్లైమాక్స్‌లోని ‘కోడ్ రెడ్’ని గుర్తు చేస్తోంది. దీంతో ‘లియో’లో కమల్ నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది.
ఇక తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.