బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. `ఆర్‌సీ16`గా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందట.
రామ్‌చరణ్‌ని అభిమానులు `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత గ్లోబల్ స్టార్‌గా పిలుచుకుంటున్నారు. ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. దాన్ని పెంచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. హీరోగా ఇప్పుడు భారీ సినిమాలతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన `గేమ్ ఛేంజర్` సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందడం విశేషం. ఇది వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రాబోతుంది. మరోవైపు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నారు.
బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. `ఆర్‌సీ16`గా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందట. మార్చిలోగానీ, ఏప్రిల్‌లో గానీ ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. చరణ్ బర్త్ డేకి స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో దర్శకుడు బుచ్చిబాబు బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇందులో రామ్‌చరణ్ పాత్ర చాలా బలంగా ఉంటుందట. స్పోర్ట్స్ డ్రామాగా సినిమా సాగుతుందని, గూస్ బంమ్స్ తెప్పించే ఎపిసోడ్లని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
అంతేకాదు రామ్‌చరణ్ యాక్టింగ్‌కి స్కోప్ ఉంటుందట. `రంగస్థలం` తర్వాత దాని మరోసారి రామ్‌చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారని టాక్. అంత స్ట్రాంగ్‌గా చరణ్ పాత్రని డిజైన్ చేస్తున్నారట బుచ్చిబాబు. దీనికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలు పూర్తయ్యాయని సమాచారం.
ఇదిలా ఉంటే రామ్‌చరణ్ హీరోగానే కాదు, వ్యాపారాల్లోనూ చురుక్కుగా పాల్గొంటున్నారు. ఇంతకు ముందు విమానం రంగంలో పెట్టుబడులు పెట్టారు. దీంతోపాటు ఆయనకు ముంబయిలో కొన్ని బిజినెస్‌లు ఉన్నాయని అంటుంటారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి ఆయన వ్యాపారాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్ హౌజ్‌ని కూడా స్థాపించి చిరంజీవితో సినిమాలు నిర్మించారు. ఇప్పుడు యూవీ విక్కీతో కలిసి నిఖిల్‌తో సినిమా నిర్మించబోతున్నారు.
ఇప్పుడు మరో కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇది నేషనల్ క్రికెట్‌కి సంబంధించినది కాదు, గల్లీ క్రికెట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌పీఎల్) పేరుతో కొత్తగా ఇండియా వైడ్‌గా గల్లీ క్రికెట్‌ని ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ఓ టోర్నమెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ టీమ్‌ని రామ్‌చరణ్ దక్కించుకున్నాడు. హైదరాబాద్ టీమ్‌కి ఆయన హోనర్‌గా ఉండబోతున్నారు. ఈ ఐసీపీఎల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది. అయితే ఇండియా వైడ్‌గా సినిమా స్టార్ట్ దీనిలోకి రావడం విశేషం.
ముంబయి జట్టుని అమితాబ్ బచ్చన్ సొంతం చేసుకున్నారు. అలాగే బెంగుళూరు జట్టుని హృతిక్ రోషన్ దక్కించుకోగా, శ్రీనగర్ జట్టుని అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఇలా ఐపీఎల్‌లో షారూఖ్ ఖాన్ వంటి వారు కోల్‌కతా టీమ్‌కి హోనర్‌గా ఉన్నట్టుగా, ఇప్పుడు ఈ స్టార్స్ గల్లీ క్రికెట్‌ని ప్రోత్సహిస్తున్నారు. ఈ గల్లీ క్రికెట్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ప్రారంభం కాబోతుంది. మార్చి 9 వరకు జరుగుతాయి. ముంబయిలో ఈ ప్రారంభ ఈవెంట్ ఉంటుంది. ఆరు టీములు ఇందులో పాల్గొంటాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వహకులు వెల్లడించారు. ఇందులో హైదరాబాద్, ముంబయితోపాటు బెంగుళూరు, శ్రీనగర్, చెన్నై, కోల్‌కతా టీములుంటాయి.
