ఇప్పటి వరకు యుద్ధం కోసం సిద్ధమవుతున్న రామరాజుని చూశారు..ఇప్పుడు భయంకరమైన అల్లూరి సీతారామరాజుని చూస్తారని చెబుతోంది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఇప్పటి వరకు యుద్ధం కోసం సిద్ధమవుతున్న రామరాజుని చూశారు..ఇప్పుడు భయంకరమైన అల్లూరి సీతారామరాజుని చూస్తారని చెబుతోంది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రేపు(మార్చి 27) రామ్‌చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి ఆయనకి, ఆయన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతుంది చిత్ర బృందం. ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం ఈ ట్రీట్‌ ఇవ్వనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. 

Scroll to load tweet…

`భయంకరమైన అల్లూరి సీతారామరాజు మిమ్మల్ని మంత్రముగ్ధుల్నిచేయడానికి వస్తున్నాడు` అని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ స్పెషల్‌ గిఫ్ట్ ని విడుదల చేయనున్నారట. ఈ సినిమాలోని రామ్‌చరణ్‌ కొత్త లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఇందులో రామ్‌చరణ్‌ సరసన అలియా భట్‌ నటిస్తుంది. ఇక కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది.