మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సీఎంగా మారబోతున్నాడు. త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట. ఊహించని విధంగా చరణ్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ ట్రెండ్‌ అయ్యింది. మరోవైపు చరణ్‌ తన నెక్ట్స్ సినిమాని ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌లో ఒకరైన శంకర్‌ డైరెక్షన్‌లో చేయబోతున్నారు. దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ త్వరలోనే రానుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా పొలిటికల్‌ సెటైర్‌ కథాంశంతో తెరకెక్కనుందట. ప్రస్తుతం రాజకీయాలు, ప్రజలు తీరు, ఇతర సామాజిక అంశాల మేళవింపుగా ఉంటుందని, ఇందులో చరణ్‌ డైనమిక్‌ సీఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. `ఒకే ఒక్కడు` తరహాలో ఈ కథ సాగుతుందనే ప్రచారం నడుస్తుంది. శంకర్‌ మార్క్ టేకింగ్‌ దీనికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలువనుందట. ఇదిలా ఉంటే చిరంజీవి తానుసీఎం కావాలని రాజకీయాల్లోకి వచ్చి `ప్రజారాజ్యం` పార్టీ పెట్టారు. కానీ విఫలమయ్యారు. పవన్‌ సైతం సీఎం కోరికతోనే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరి ఆ కోరికని చరణ్‌ సినిమాలో ఈ రూపంలో తీరుస్తాడా? అనే సెటైర్లు కూడా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.